పి.కున్హి కృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.కున్హికృష్ణన్
P.Kunhikrishnan.jpg
పి.కున్హికృష్ణన్
జననంపి.కున్హికృష్ణన్

నివాస ప్రాంతంతమిళనాడు
వృత్తిశాస్త్రవేత్త
ఉద్యోగండైరెక్టరు. ఇస్రో,శ్రీహరికోట నెల్లూరు

పి.కున్హికృష్ణన్ ఒక ఇస్రో శాస్త్రవేత్త,ఎలక్ట్రానిక్సు, కమ్యూనికేసన్ లోఇంజనీరింగు చేశాడు. పి.కున్హి కృష్ణన్ జులై 2015 నుండి జులై 31 2018 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ,నెల్లూరు జిల్లాలో వున్న శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(క్లుప్తంగా షార్)కు డైరెక్టరుగా పనిచేశాడు.షార్ లో ఈయన అధికారిగా వున్న ఈ కాలంలో పలు ఉపగ్రహాలను విజయవంతంగా పూర్తి చేసాడు.[1][2][3]

పి.కున్హికృష్ణన్ విద్యార్హతలు[మార్చు]

పి.కున్హి కృష్ణన్ కేరళ రాష్ట్రానికి చెందినవాడు.త్రివేండ్రం లోని కాలేజీ ఆఫ్ ఇంజనీరింగులో ఎలక్ట్రానిక్సు, కమ్యూనికేసన్ లో బి.టెక్ చదివాడు.[1]

ఇస్రోలో పి.కున్హికృష్ణన్ పయనం[మార్చు]

1986 లోఇస్రోలో చేరాడు.ఇస్రో లోని వీఎస్ఎస్సిలోని సిస్టమ్స్ రెలియబిలిటీ ఏంటీటీలో పనిచేశాడు. ఫిబ్రవరి 2009లో పిఎస్ ఎల్వీ ప్రోజెక్ట్ అసోసియేట్ ప్రోజెక్ట్ డైరెక్టరు అయ్యాడు.జులై 2010 లో డైరెక్టరు ఆఫ్ పిఎస్ ఎల్వీ ప్రొజెక్ట్ గా ఎన్నిక కాబడ్డాడు.మిసన్ డైరెక్టరు గా 13 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలన్నువిజయవంతంగా నిర్వహించాడు.వాటిలో పిఎస్ఎల్వి- సీ 19 ద్వారా ప్రయోగించిన రీశాట్-1 ఉపగ్రహం.సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశ పెట్టిన బరువైన భారతీయ ఉపగ్రహం ఇది.ఆ తరువాత పిఎస్ఎల్వి- సీ 21, సీ23 ద్వారా ఫ్రెంచి భూపరిశీలన ఉపగ్రహాలను(Earth Observation Satellites)ను కూడా అతని ఆద్వర్యంలో విజయవంతంగా ప్రయోగింపబడినవి.ఫిబ్రవరి 2015లో వి ఎసెస్సీ (VSSC)లో MVIT విభాగానికి ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందాడు.[1]

2015 లో షార్ డైరెక్టరు అయ్యక 38 నెలలపాటు ఉపగ్రహాల ప్రయోగాలు వేగవంతంకావించాడు.పి.కున్హికృష్ణన్ తన పదవి కాలళో 21 రాకెట్/ఉపగ్రహ వహాకనౌక లను విజయవంతంగా ప్రయోగించాడు. పి.కున్హికృష్ణన్ ఆద్వర్యం లో 14 పిఎస్‌ఎల్‌వి రాకెట్లు,4 జీఎస్‌ఎల్‌వి రాకెట్లు,ఒక జీఎస్‌ఎల్‌వి మార్క్ 3 రాకెట్ ప్రయోగాలు జరిగాయి.వీటితో పాటు ఒక రీయుజబుల్ లాంచ్ వెహికిల్ ప్రయోగంకూడా జరిపాడు. పి.కున్హికృష్ణన్ షార్ డైరెక్టరుగా అవ్వకముందు,షార్ లో రాకెట్ ను అనుసంధానం కు 52 రోజులు పట్తెవి.అంచెలంచెలుగా ఆసమయాన్ని తగ్గిస్తూ వచ్చి,కేవలం 22 రోజుల్లోనే అనుసంధానం కావించేలా చేశాడు.

అవార్డులు[మార్చు]

2010లో ఇస్రో వ్యక్తిగత ప్రతిభ అవార్డు పొందాడు,2011లో అస్టోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండీయా అవార్డు పొందాడు.

బయటి వీడియోల లింకులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]