Jump to content

పి.చంద్రశేఖర్

వికీపీడియా నుండి
పి.చంద్రశేఖర్

చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ
పదవీ కాలం
1983 – 1984

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ,శాసనసభ వ్యవహారాలుశాఖమాత్యులు
పదవీ కాలం
1984 – 1985

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ గోల్కొండ బోర్డు డైరెక్టర్
పదవీ కాలం
1985 – 1988

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణఅభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా శాఖమాత్యులు
పదవీ కాలం
1988 – 1989

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖమాత్యులు
పదవీ కాలం
1994 – 1995

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖమాత్యులు
పదవీ కాలం
1998 – 1999

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖమాత్యులు
పదవీ కాలం
1999 – 2004

వ్యక్తిగత వివరాలు

జననం 1949 జూలై 15
సుభాష్ నగర్, మహబూబ్ నగర్, తెలంగాణ[1]
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి భాగ్యవతి
సంతానం 2
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

పాడపాటి చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగుసార్లు మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

చంద్రశేఖర్ 1949, జూలై 15న మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించాడు. బీకాం, ఎల్.ఎల్.బి. అభ్యసించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పి.చంద్రశేఖర్ తొలిసారి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1982లో నూతనంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1985లో టీడీపీ తరపున పోటీ చేసి రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

పి.చంద్రశేఖర్ 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తరువాత , ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2013లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీకి రాజీనామా చేశాడు.

పొడపాటి చంద్రశేఖర్‌ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన 2023 అక్టోబర్ 29న హైదరాబాద్‌ లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీజేపీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. CEO Telangana (2012). "పి.చంద్రశేఖర్" (PDF). Archived from the original (PDF) on 22 April 2022. Retrieved 22 April 2022.
  2. "Mahabubnagar Politics". 29 October 2023. Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  3. Namasthe Telangana (30 October 2023). "బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
  4. Andhrajyothy (30 October 2023). "బీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్ర శేఖర్‌, పి.చంద్ర శేఖర్‌". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.