పి.వి.ఆర్.శివకుమార్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పి.వి.ఆర్.శివకుమార్ ప్రముఖ రచయిత.[1] 1970 ల్లో యువ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, స్వాతి, ఆదివారం ఈనాడు లాంటి అనేక పుస్తకాలలో అనేక రచనలు చేసారు.[2] ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా అనేక నాటకాలు ప్రసారం అయ్యాయి.
బాల్యం,విద్య
[మార్చు]1951 నవంబర్ లో జన్మించారు. తండ్రి పిన్నలి వేంకటరామ నరసింహారావు . తల్లి పిన్నలి కనక దుర్గాంబ. బాల్యమంతా విజయవాడలో గడిచింది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో యస్. యమ్. వి. యమ్. పాలిటెక్నిక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, డిప్లొమా పొందారు. ఎచ్.ఎం.టి. లో ఉద్యోగ జీవితం ప్రారంభించి, ముప్ఫై ఏళ్ల అనంతరం, ప్రైవేట్ సెక్టార్ వాక్యూమ్ టెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి మారారు. ఈయన భార్య వరలక్ష్మి, వీరికి ఇద్దరు పిల్లలు ఉదయ్,శిరీష.అల్లుడుదినేష్.కోడలు ప్రత్యూష. మనుమడు విహాన్. ప్రస్తుత నివాసం ముంబై.
రచనలు
[మార్చు]మొదటి రచన 14 ఏళ్ళ వయసులో రాసిన చిన్ననాటిక ఇది బాలబంధు అనే చిన్నపిల్లల పక్షపత్రికలో అచ్చయింది. అప్పటి నుండి దాదాపు మూడు వందల కథలు, తొమ్మిది నవలలు రాసారు. అనేక కథానికలు, నాటికలు హైదరాబాద్ ఆకాశవాణి ద్వారా ప్రసారమైనాయి. అన్ని ప్రసిద్ధ పత్రికలు వీరి కథలను ప్రచురించాయి. వాటిలో 33 కథలకు బహుమతులు గెలుచుకున్నారు.
కథలు, కథానికలు
[మార్చు]ఇప్పటి వరకు సుమారు 300 కథలు, నాటికలు రాశారు.
ప్రచురితమైన కొన్ని కథలతో ఇప్పటి వరకు నాలుగు కథా సంపుటాలు వచ్చాయి. అవి:
- పి.వి.ఆర్. శివకుమార్ కథానికలు సంపుటం
- కిరణం
- అతిథి(కి) దేవుడు - బహుమతి కథలు
- నీదేగానీ నీదేకాదు - స్వాతి కామెడీ కథలు
నాటికలు
[మార్చు]- ఉన్నవాడిదే ఇల్లు
- అనేక రేడియో నాటికలు
సీరియల్స్
[మార్చు]- శమంత హేమంత
- జీవనపోరాటంలో ఆశల ఆరాటం
- మరో ఏడు నవలలు యువ, ప్రభవ, విజయ మాస పత్రికలలో నవలానుబంధాలుగా వచ్చాయి.
బహుమతులు
[మార్చు]- 1983 దీపావళి కథలపోటీలో ఆంధ్రపత్రిక కథలపోటీలో వచ్చిన బహుమతి మొదలుకొని, ఇప్పటి వరకు స్వాతి, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, హాస్యానందం, వంటి వివిధ పత్రికలలో ముప్ఫైమూడు కథలకు బహుమతులు వచ్చాయి.
- అందులో ఎనిమిది బహుమతులు స్వాతి సపరివార పత్రికలోనే - సరస, సహస, కామెడీ కథలకు వచ్చాయి.
మూలాలు
[మార్చు]- ↑ "కినిగె లో ఆయన రాసిన కథానికల పుస్తక వివరాలు". Archived from the original on 2016-10-17. Retrieved 2016-10-29.
- ↑ కథానిలయంలో రచయిత పుటలో ఆయన రాసిన కథానికలు