Jump to content

పి.వి.రామ మోహన్ నాయుడు

వికీపీడియా నుండి

సీనియర్ జర్నలిస్టు పి.వి.రామ మోహన్ నాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్రికేయుడి గా, కాలమిస్టుగా, రచయతగా, టి.వి చిత్రాల నిర్మాతగా, నంది, ఫిలిం ఫేర్ ఛిత్రాల అవార్డుల న్యాయ నిర్ణేతల కమిటీ సభ్యుడిగా సుపరిచితుడు1985 లో ఈనాడు దినపత్రికతో రిపోర్టర్, సబ్ ఎడిటర్ గా రామ మోహన్ తన పాత్రికేయ జీవితం ఆంధ్ర జ్యోతి దినపత్రికలో సిటి ఎడిటర్ గా రాణింపు గుర్తింపు పొందింది. ఆంధ్ర జ్యోతిలో “చార్ సౌ షహర్ హమారా” వంటి శీర్షికలతో నగర వార్తల పేజిని నడిపారు. అనంతరం ఫ్రీ లాన్సర్ గా మారి వార్త దిన పత్రికలో అడుగు జాడలు, సుప్రభాతం వారపత్రికలో “రెమ్ పేజ్”, “సెన్స్ ఆఫ్ హెమర్”, పేరిట హాస్య చతురోక్తుల శీర్షికలను నడిపారు. 252 మంది సజీవ దిగ్గజాల సంక్షిప్త విజయ గాథలను 5 ఏళ్ళ పాటు వార్త దిన పత్రికలో రాసిన అడుగు జాడలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. టి.వి చిత్రాల నిర్మాత, రచయతగా కూడా రామ మోహన్ నాయుడు లబ్ధ ప్రతిష్ఠుడు. ఆయన కథ సమకూరుస్తూ నిర్మించిన “ సిరి” దూరదర్శన్ లో 500 భాగాలు ప్రసారమై వెండి నందిని అందుకొంది. “ అపరంజి” విజయవంతంగా 300 ఎపిసోడ్లు ప్రసారమై ఉత్తమ బాలల చిత్రంగా బంగారు నంది అవార్డును కైవసం చేసుకొంది.” భారత స్వాతంత్ర దినోత్సవం స్వర్ణోత్సవాల సందర్భంగా ఆయన రూపొందించిన “ వికాసాంధ్ర” 5 భాగాల లఘు చిత్రం కూడా నంది పురస్కారాన్ని పొందింది. “ హాలాహలం”, “మామాజి మాయాజాలం”, “అపూర్వ వైభవం” వీక్లీ సీరియళ్లు కూడా మంచి ఆదరణను పొందాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు ఆయన ఎన్నో ప్రచార చిత్రాలు, లఘు చిత్రాలు నిర్మించారు. లెక్కకు మించిన టి.వి కార్యక్రమాలకు ఆయన రచయతగా పనిచేశారు. 2005, 2009 సంవత్సరాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ టి.వి నంది అవార్డుల ఎంపిక కమిటీసభ్యులుగా వ్యవహరించారు. 2003, 2005 సంవత్సరాల ఫిలిం ఫేర్ అవార్డుల జ్యూరి సభ్యులుగా పనిచేశారు.కరీం నగర్ ఫిలిం సొసైటి నిర్వహించిన పాలపిట్ట లఘు చిత్రాల అవార్డుల సంఘానికి అధ్యక్ష్యుడుగాను, సి.జగన్ మోహన్ రావు ఉత్తమ క్రీడా రచయతల అవార్డుల2010, 11 సంవత్సరాల ఎంపిక సంఘానికి సభ్యుడిగా పనిచేశారు.