Jump to content

పి. సుధీర్ కుమార్

వికీపీడియా నుండి
పి. సుధీర్ కుమార్
పి. సుధీర్ కుమార్


పదవీ కాలం
1989 - 1994
ముందు నల్లు ఇంద్రసేనారెడ్డి
తరువాత మల్‌రెడ్డి రంగారెడ్డి
నియోజకవర్గం మలక్‌పేట్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960 ఫిబ్రవరి 22
హిమాయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
మరణం 26 మే 2002
హైదరాబాద్‌
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పి. శివశంకర్, లక్ష్మీబాయి
జీవిత భాగస్వామి గీత’ anjana
సంతానం 4

పుంజల సుధీర్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మలక్‌పేట్ నియోజకవర్గం నుండి 1989 నుండి 1994 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పి. సుధీర్ కుమార్ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ లో పి. శివశంకర్, లక్ష్మీబాయి దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పి. సుధీర్ కుమార్ తన తండ్రి మాజీ కేంద్ర మాజీ మంత్రి పి. శివశంకర్ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన యూత్ కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పని చేసి 1988 నుండి 1993 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డి పై 10988 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

పి. సుధీర్ కుమార్ 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి చేతిలో, 1999లో బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డి చేతిలో ఓడిపోయాడు.

మరణం

[మార్చు]

పి. సుధీర్ కుమార్ 26 మే 2002న హైదరాబాద్‌లో అనార్యోగంతో మరణించాడు. ఆయనకు భార్య గీత,anjana, 4 పిల్లలు ఉన్నారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. India Today, india today digital (30 November 1989). "Senior leaders dole out tickets to their sons" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  2. The Times of India (28 May 2002). "Sudhir Kumar's death condoled" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  3. Rediff (2002). "APCC vice-president Sudhir Kumar dead". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.