Jump to content

పీనియల్ గ్రంధి

వికీపీడియా నుండి

పీనియల్ గ్రంధి (Pineal gland) (సుషుమ్న నాడి, కుండలి, లేదా బ్రహ్మనాడి) అనేది దాదాపు అన్ని సకశేరుకాల మెదడులో ఉండే ఎండోక్రైన్ గ్రంధి. ఈ గ్రంధి మెలటోనిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోను నిద్రను నియంత్రిస్తుంది. ఇది పైన్ కోన్ ఆకారంలో ఉండటం చేత ఆ పేరు వచ్చింది.[1] ఇది ఎరుపు ఊదారంగులను కలగలిసి ఉంటుంది. మానవ మస్తిష్కంలో దీని పరిమాణం సుమారు ఒక బియ్యపు గింజంత (సుమారు 5- 8 మి.మీ) ఉంటుంది.

పురాతన గ్రీకులు దీన్ని మొదటి సారిగా గుర్తించారు. దీన్ని ఒక కవాటం లాంటిది అనుకున్నారు.

నిర్మాణం

[మార్చు]

పీనియల్ గ్రంథి 1-2 సంవత్సరాల వయసు దాకా నెమ్మదిగా పరిమాణం పెరిగి తర్వాత అలాగే ఉండిపోతుంది.[2][3] కానీ దాని బరువు మాత్రం యవ్వనం తర్వాత కొద్దిగా పెరుగుతుంది.[4][5]

సమాజం, సంస్కృతి

[మార్చు]

19వ శతాబ్దంలో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించిన తాత్వికురాలు మేడం బ్లావట్‌స్కీ ఈ గ్రంధిని హిందూమతంలో పేర్కొన్న మూడో నేత్రం, లేదా ఆజ్ఞాచక్రంగా అభివర్ణించింది. ఈ భావన ఇప్పటికీ ప్రజాదరణ పొందుతోంది.

మూలాలు

[మార్చు]
  1. "Pineal (as an adjective)". Online Etymology Dictionary, Douglas Harper. 2018. Retrieved 27 October 2018.
  2. Schmidt F, Penka B, Trauner M, Reinsperger L, Ranner G, Ebner F, Waldhauser F (April 1995). "Lack of pineal growth during childhood". The Journal of Clinical Endocrinology and Metabolism. 80 (4): 1221–5. doi:10.1210/jcem.80.4.7536203. PMID 7536203.
  3. Sumida M, Barkovich AJ, Newton TH (February 1996). "Development of the pineal gland: measurement with MR". AJNR. American Journal of Neuroradiology. 17 (2): 233–6. PMC 8338352. PMID 8938291.
  4. Tapp E, Huxley M (September 1971). "The weight and degree of calcification of the pineal gland". The Journal of Pathology. 105 (1): 31–9. doi:10.1002/path.1711050105. PMID 4943068. S2CID 38346296.
  5. Tapp E, Huxley M (October 1972). "The histological appearance of the human pineal gland from puberty to old age". The Journal of Pathology. 108 (2): 137–44. doi:10.1002/path.1711080207. PMID 4647506. S2CID 28529644.