పుట్టావారి పాలెం(అడ్డ రోడ్డు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
నిర్దేశాంకాలు: 16°07′16″N 79°55′44″E / 16.1210695°N 79.9288049°E / 16.1210695; 79.9288049Coordinates: 16°07′16″N 79°55′44″E / 16.1210695°N 79.9288049°E / 16.1210695; 79.9288049
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంసంతమాగులూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)Edit this at Wikidata


పుట్టావారి పాలెం(అడ్డ రోడ్డు), బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523 302., ఎస్.టి.డి.కోడ్ = 08404.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

శుద్ధజల కేంద్రం[మార్చు]

ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న ఈ గ్రామంలో శుద్ధజలం అందించేటందుకు గ్రామంలో ఈ కేంద్రాన్ని, 2 సంవత్సరాల క్రితం, 2.55 లక్షల వ్యయంతో నిర్మించారు. దీని నిర్మాణానికి హైదరాబాదుకు చెందిన హోప్ ఫర్ బెటర్ లైఫ్ అను స్వచ్ఛంద సంస్థ 1.75 లక్షల రూపాయల ఆధిక సహాయం అందంచింది. మిగతా మొత్తాన్ని, గ్రామస్థులు, స్థానికంగా దాతలు అందించారు. పంచాయతీ కేంద్ర ఆవరణలో కేంద్రాన్ని నిర్మించి, పరికరాలను అమర్చారు. ఆ ప్రక్కనే ఉన్న పంచాయతీ చేతిపంపునకు విద్యుత్తు మోటారును బిగించి, శుద్ధజల కేంద్రానికి అనుసంధానించారు. [4]

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్[మార్చు]

ఈ బ్యాంక్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను, 2017,జూన్-1న నిర్వహించారు. [6]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో పుట్టావారిపాలెం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ అంజియ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వేంకటేశ్వరస్వామివారి అలయం[మార్చు]

పుట్టావారిపాలెం గ్రామ కూడలిలోని రక్షిత మంచినీటి పథకం ఆవరణలో స్థానికులు సమష్టిగా నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం 2016,ఫిబ్రవరి-26వ తేదీ, మాఘ బహుళ పంచమి, శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. తదుపరి, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈ గ్రామస్థులతోపాటు చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [5]

శ్రీ గంగమ్మ తల్లి ఆలయo[మార్చు]

ఈ గ్రామంలోని గంగంమ్మ తల్లి ఆలయ 20వ వార్షిక తిరునాళ్ళు, 18,జూన్-2014, బుధవారం నాడు, కన్నులపండువగా నిర్వహించారు. శుభమలీయవమ్మా గంగమ్మ తల్లీ, అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. నిమ్మకాయలతో విశేషాలంకృతురాలయిన అమ్మవారికి, భక్తులు ప్రత్యేకపూజలు చేసి, పొంగళ్ళు సపర్పించారు. ప్రభలను ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు. [3]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జనవరి-6; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జూన్-19; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,సెప్టెంబరు-15; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,ఫిబ్రవరి-27; 3వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,జూన్-2; 2వపేజీ.