పుట్టెనహళ్లి సరస్సు
పుట్టెనహళ్లి సరస్సు, జెపినగర్ | |
---|---|
Location | జెపినగర్, భారతదేశం |
Nearest city | బెంగుళూర్ |
Coordinates | 12°53′26.37″N 77°35′12.02″E / 12.8906583°N 77.5866722°E |
Area | 13 acres |
Governing body | Puttenahalli Neighbourhood Lake Improvement Trust |
పుట్టెనహళ్లి సరస్సు దక్షిణ బెంగుళూరులోని JP నగర్ 7 వ ఫేస్ లో ఉన్న ఒక చిన్న మంచినీటి సరస్సు. ఈ సరస్సు విస్తీర్ణం దాదాపు 13 ఎకరాలు. వర్షం నీరు, కాలువల నీటి ద్వారా సరస్సుకి నీరు వచ్చి చేరుతాయి. ఈ సరస్సు ప్రస్తుతం పుట్టెనహళ్లి నైబర్‌హుడ్ లేక్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ (PNLIT) ద్వారా పరిరక్షించబడుతుంది.[1]
చరిత్ర
[మార్చు]పుట్టెనహళ్లి సరస్సు బెంగుళూరులో గల సహజమైన సరస్సులలో ఒకటి. ఒకప్పుడు ఈ సరస్సు దగ్గర కాలుష్యం, నిర్లక్ష్యంగా చెత్త వేయటం వంటి వాటి ద్వారా ఇది మురికిగా ఉండేది. కానీ PNLIT ఈ సరస్సు పరిరక్షణ, పునరుద్ధరణ బాధ్యతను తీసుకున్నాక కాస్త మెరుగుపడింది. ఇది స్థానిక నివాసితుల నుండి విరాళాలు సేకరించి సరస్సు ప్రాథమిక అభివృద్ధిని మొదలుపెట్టింది. వృక్ష, జంతుజాల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఇతర సారూప్య సంస్థలతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించింది.
చెట్లు,మొక్కలు
[మార్చు]పుట్టెనహళ్లి సరస్సు చుట్టూ పెరిగే కొన్ని చెట్లు, మొక్కలు కింద ఇవ్వబడ్డాయి.[2]
- మహోగని
- కదంబ
- పోర్టియా ట్రీ
- సింగపూర్ చెర్రీ
- పారాడైస్ ట్రీ
- గ్మెలినా అర్బోరియా
- బ్యాడ్మింటన్-బాల్ ట్రీ మొదలైనవి.
పక్షులు
[మార్చు]80 జాతులకు పైగా ఉన్న స్థానిక, వలస పక్షుల జాతులను ఇక్కడ గుర్తించారు. ఇది పక్షులను ఇష్టపడే వారికి ఒక అద్భతమైన ప్రదేశంగా మారింది.[3]
- ఇండియన్ స్పాట్-బిల్ డక్
- పర్పుల్ హెరాన్
- యురేషియన్ కూట్
- ఇండియన్ పౌండ్ హెరాన్
- గార్గేనీ[4]
కామన్ కింగ్‌ఫిషర్ వంటి మొదలైన పక్షులు ఈ సరస్సు చుట్టూ కనబడతాయి.
అభివృద్ధి
[మార్చు]కర్ణాటక కాలుష్య నియంత్రణ బోర్డు (KSPCB) సరస్సును స్వచ్ఛమైన నీటితో నింపడానికి సమీపంలోని మురుగునీటి శుద్ధి కర్మాగారం సహాయంతో అభివృద్ధి పనులు మొదలు పెట్టింది. సరలోని కొంత భాగం భవనాలలో ఆక్రమణకు గురైంది. BBMP జాగింగ్ ట్రాక్, పార్క్ చుట్టూ ఉన్న సరస్సును శుభ్రం చేసి అభివృద్ధి చేస్తోంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Staff Reporter (12 December 2011). "Puttenahalli lake is now a clean water body" – via www.thehindu.com.
- ↑ "Flora and Fauna - PNLIT". www.puttenahallilake.in.
- ↑ "Puttenahalli Lake Bird Count -". Citizen Matters Blogs.
- ↑ Nazareth, Marianne De (1 December 2011). "Ducking it" – via www.thehindu.com.
- ↑ "Milestone morning -". Citizen Matters Blogs.