పునర్జన్మ (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పునర్జన్మ
కృతికర్త: బెల్లంకొండ రామదాసు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: శ్రీలక్ష్మీ ప్రింటర్స్ (విజయవాడ), దేశి బుక్ డిస్ట్రిబ్యూటర్స్ విజయవాడ
విడుదల: 1956 (మొదటి ముద్రణ), ఏప్రిల్ 1981 (రెండవ ముద్రణ), 2011 (డిజిటల్)
పేజీలు: 84


పునర్జన్మ బెల్లంకొండ రామదాసు రాసిన సాంఘీక నాటకం.[1] శిథిలమవుతున్న పాతకు, మొలకలెత్తుతున్న కొత్తకు మధ్య జరుగుతున్న సంఘర్షణ నేపథ్యంలో ఈ నాటకం రాయబడింది.

కథానేపథ్యం

[మార్చు]

అందరిచేత మోసగించబడి పతితగా మారిన ఒక యువతి తన జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటుంది. అ క్రమంలో ఆ యువతికి ఎదురయ్యే సమస్యలు, సమాజం నుండి ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ నాటకంలో చూపించబడ్డాయి.

పాత్రలు

[మార్చు]
  • మూర్తి (డాక్టర్)
  • జనార్థనరావు (తండ్రి)
  • కుమార్
  • రంగారావు (క్లబ్ సెక్రటరీ)
  • నాగయ్య (కంపౌండర్)
  • నరసయ్య (నౌకరు)
  • శ్యామల (డాక్టరు భార్య)
  • చిన్న (డాక్టరు చెల్లి)

ఇతర వివరాలు

[మార్చు]
  1. 1955లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారి నాటక పోటీల్లో ఉదయిని సంస్థ విజయవాడ ఈ నాటకాన్ని ప్రదర్శించగా ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన బహుమతులు వచ్చాయి.
  2. ఈ నాటకాన్ని ఎంఎస్ మూర్తి, కేవీఎస్ శర్మ, వెంపటి రాధాకృష్ణ, నండూరి సుబ్బారావు, నిర్మలమ్మ తదితరులు ప్రదర్శించారు.

మూలాలు

[మార్చు]
  1. సంస్కరణలకు బాటలు వేసిన పునర్జన్మ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 14 ఆగస్టు 2017, పుట.14

ఇతర లంకెలు

[మార్చు]