Jump to content

బెల్లంకొండ రామదాసు

వికీపీడియా నుండి
బెల్లంకొండ రామదాసు
జననంబెల్లంకొండ రామదాసు
(1923-08-23)1923 ఆగస్టు 23
India
మరణం1969 సెప్టెంబరు 19
ప్రసిద్ధికవి, నాటక రచయిత, అనువాదకుడు
మతంహిందూ

బెల్లంకొండ రామదాసు (1923-1969) పేరు పొందిన కవి, నాటక రచయిత, అనువాదకుడు.[1]

రచనా ప్రస్థానం

[మార్చు]

1940లో శ్మశానం అనే పేరుతో కవితా సంపుటిని వెలువరించాడు. 1944లో ఇతను అభ్యుదయకవితా యుగంలో అచ్చయిన తొలి కావ్యము నయాగరాను ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులతో కలిసి వెలువరించాడు.[2] 1953లో అతిథి అనే పేరుతో తన తొలి నాటకాన్ని రాశాడు. ఇతర సాంఘిక నాటకాలు, పునర్జన్మ, పంజరం, రంగస్థలంపై మంచి పేరు తెచ్చుకున్నాయి. చిలక చదువు (1953) పేరుతో కొన్ని రవీంద్రనాధ్ ఠాగూర్ కథలను అనువదించాడు.[1][3]

రచనలు

[మార్చు]
  1. డోరియన్ గ్రే[4] (ఆస్కార్ వైల్డ్)- అనువాద నవల
  2. భయస్థుడు (గొర్కి) - అనువాద నవల
  3. ఇవాన్‌ ఇలిచ్‌ మృతి మరికొన్ని కథలు (టాల్ స్టాయ్)- అనువాద నవల
  4. నీలికళ్లు[5] (బాల్జాక్- అనువాద నవల: 1958)
  5. కన్నీరు (మపాసా)- అనువాద నవల
  6. నానా[6] (ఎమిలి జోలా) - అనువాద నవల
  7. గీతాంజలి[7] (ఠాగూర్)-అనువాదం
  8. జీవితము-మతము[8] (టాల్ స్టాయ్ వ్యాసావళి -అనువాదం: 1959)
  9. కలికాలం[9] (చార్లెస్ డికెన్స్) - అనువాదం
  10. రెబెకా- అనువాదం
  11. పరిత్యాగము[10] (ఠాగూర్) -అనువాద కథలు - నన్నపనేని సుబ్బారావుతో కలిసి
  12. మాస్టర్జీ[11] - నాటకం
  13. యుద్ధము- శాంతి (3 భాగాలు) [టాల్ స్టాయ్] - రెంటాల గోపాలకృష్ణతో కలిసి
  14. చందమామ (కథ),
  15. చతురస్రం (గొలుసు -అనువాదంకథ).
  16. పిచ్చివాని జ్ఞాపకాలు - టాల్ స్టాయ్ కథలు (పిచ్చివాని జ్ఞాపకాలు, యజమాని-మనిషి, నెగడి) - -అనువాదం.
  17. పునర్జన్మ[12] - నాటకం
  18. అతిథి - నాటకం
  19. పంజరం - నాటకం[13]
  20. శ్మశానం - కవితా సంపుటి
  21. ఈ రోజున నా గీతం - నాటకం
  22. గిలక కడవ - బెంగాళి అనువాద కథలు
  23. మన కాలం వీరుడు (లెర్మంతోవ్‌) - నవల

రచనల నుండి ఉదాహరణ

[మార్చు]

చెరసాల[14]

ఇన్నాళ్ళూ
సమాజం ఒక సంకెళ్ల చెరసాల!
హత్యలు జరిగిన చెరసాల!
నెత్తురు పారిన చెరసాల!
దుర్మార్గులు కట్టిన చెరసాల!
ఒక పెద్ద చెరసాల!
బానిసత్వ శాస్త్రం
శాసించిన పూజారులు
నెత్తుటి కత్తులు
ఝళిపించిన సామ్రాట్టులు
హత్యా మంత్రాంగం
పన్నిన అమాత్యులు
దుర్మార్గులు మఠాధిపతులు
నరహన్తలు మతాధినేతలు
ఒకటై
జరిపించిన ఘోరహత్య
తగిలించిన అనల శృంఖల
కట్టిన బానిసత్వ కారాగృహమది
గత కాలపు సమాజ పద్ధతి!
పుణ్యం పేరిట
యజ్ఞంలో నరికిన
పసి మేకల శిరస్సులూ
ఉరి బండల
ఆహుతైన
పతిత ప్రజా శిరస్సులూ
పూజారీ కర్మల్లో
రాజన్యుల కత్తుల్లో
నలిగిన అనాథుల ఆక్రందన
ఇదేనా
పూర్వపు సమాజ నిర్మాణం?
పర పీడనకై
పరిపాలనకై
స్వార్థ పరులు
తమ అధికారం నిలుపుకోను
మతాధి నేతలు
వ్రాసిన దుర్మార్గపు శాస్త్రశాసనం
తగిలించిన నియమ శృంఖల
రాజులు
ఏకచ్ఛత్రంగా
ఏలిన శవ సామ్రాజ్యం
ఇదే కదా గతకాలపు
సమాజ పద్ధతి!
పూజారుల అధికారం
రాజన్యుల నియంతృత్వం
కట్టిన పెద్ద జైలు కొట్టు
చేసిన మహాహత్య
ఇదే కదా పూర్వపు
సమాజ చరిత్రమంతా!
గుండెలు మంటలుగా
కన్నులు కాలువగా
మారుతాయి
ఈ సమాజ హత్యా చరిత్ర చూస్తే!
రాజన్యుల
రథ చక్రపు
ఘట్టనలో
పడి నలిగే
దీనులార!
మతాధి నేతల
శాస్త్రాల చెప్పుల క్రింద
నలిగి నలిగి రోదించే
పసితనంలో పతి పోయిన
అమాయక కన్యలార!
స్వేచ్ఛ లేక
సమ్రాట్టుల
నేత్రాగ్నుల
దగ్ధమైన
జాతులార!
మరలో
మరగా
అరిగిపోవు
కార్మికులారా!
జమీందార్ల
పొట్టలు నింపను
ధాన్యం పండించే
కర్షకులారా!
ఓహో!
ఓహో!
అణగారిన
ప్రపంచ దీనులారా!
మీకై
ఈనాడొక
అగ్ని పర్వతం
పగులుతోంది చూచారా!
మీకై
ఈనాడొక
అరుణ పతాకం
ఎగురుతోంది చూచారా!
మీకై
ఈనాడొక
నవజగత్తు
ప్రభవిస్తున్నది చూచారా!
మీకై
ఈనాడొక
నందనవన వసంత మందారం
కుసుమించెను చూచారా!
మీకై ఈనాడొక
రణభేరి
పగిలింది విన్నారా!
( నయాగరా ఖండకావ్య సంపుటి నుండి)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Das, Sisir Kumar (1991). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. Sahitya Akademi. p. 570. ISBN 9788172017989. Retrieved 12 April 2015.
  2. నవతెలంగాణ, కవర్ స్టోరి (5 November 2016). "ఆ స్ఫూ‌ర్తి‌తో..." NavaTelangana. Archived from the original on 7 సెప్టెంబరు 2017. Retrieved 6 January 2020.
  3. Sinha, Biswajit (2007). South Indian theatre - Volume 8 of Encyclopaedia of Indian theatre. Raj Publications. p. 29. ISBN 9788186208540. Retrieved 12 April 2015.
  4. బెల్లంకొండ రామదాసు (1957). డోరియన్ గ్రే. విజయవాడ: ఆదర్శ గ్రంథమండలి. Retrieved 11 April 2015.
  5. బెల్లంకొండ రామదాసు (1958). నీలికళ్లు (అనువాదం - మూలం:బాల్ జాక్). వుయ్యూరు: భవానీ పబ్లిషింగ్ హౌస్. Retrieved 11 April 2015.
  6. బెల్లంకొండ రామదాసు (1959). నానా. విజయవాడ: ఆదర్శ గ్రంథమండలి.
  7. బెల్లంకొండ రామదాసు. గీతాంజలి (అనువాదం - మూలం: రవీంద్రనాథ్ టాగూరు). విజయవాడ: జయంతి పబ్లికేషన్స్. Retrieved 11 April 2015.
  8. బెల్లంకొండ రామదాసు (1959). జీవితము మతము (టాల్‌స్టాయి వ్యాసావళి) (1 ed.). విజయవాడ: రవీంద్ర గ్రంథమాల. Retrieved 11 April 2015.
  9. బెల్లంకొండ రామదాసు (1960). కలికాలం (అనువాదం - మూలం:చార్లెస్ డికెన్స్). విజయవాడ: జనతా ప్రచురణాలయం. Retrieved 11 April 2015.
  10. బెల్లంకొండ రామదాసు, నన్నపనేని సుబ్బారావు (1959). పరిత్యాగము. విజయవాడ: రవీంద్ర గ్రంథమాల. Retrieved 11 April 2015.
  11. బెల్లంకొండ రామదాసు (1958). మాస్టర్జీ. విజయవాడ: జయంతి పబ్లిషింగ్ హౌస్. Retrieved 11 April 2015.
  12. సంస్కరణలకు బాటలు వేసిన పునర్జన్మ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 14 ఆగస్టు 2017, పుట.14
  13. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.
  14. "నయాగరా". ఆంధ్రభారతి. Archived from the original on 28 మార్చి 2014. Retrieved 11 April 2015.