Jump to content

పుప్పాల శ్రీనివాస రావు

వికీపీడియా నుండి
పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు గన్ని వీరాంజనేయులు
నియోజకవర్గం ఉంగుటూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1968
భువనపల్లె , నిడమర్రు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు హేమసుందర వెంకటరమణ (ఏసుబాబు), సత్యనారాయణమ్మ
జీవిత భాగస్వామి అడివల్లి రమణి
సంతానం స్నిగ్ధ, ప్రణా

పుప్పాల శ్రీనివాస రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, నిడమర్రు మండలం, భువనపల్లె గ్రామంలో జన్మించాడు. ఆయన 1984లో గణపవరంలోని చింతలపాటి బాపిరాజు జూనియర్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

పుప్పాల శ్రీనివాస రావు 2006లో భువనపల్లె గ్రామా సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన 2004లో ప్రజారాజ్యంలో చేరి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనంతరం 2011లో వైసీపీ పార్టీలో చేరాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు పై 33153 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "శాసనసభా స్థానాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
  3. Sakshi (16 March 2019). "అలా... 'పేరు' గాంచారు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
  4. Sakshi (24 May 2019). "'పదేళ్ల నుంచి ప్రజల్లోనే ఉన్నందుకు..'". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.