పురాణం సుబ్రహ్మణ్య శర్మ
Appearance
పురాణం సుబ్రహ్మణ్య శర్మ తెలుగు వారపత్రికలలో ఒక ఒరవడి సృష్టించిన మంచి సంపాదకులలో కొడవటిగంటి కుటుంబరావు సరసన నిలబడగల వారిలో ప్రథముడు. ఆంధ్రజ్యోతి వారపత్రికకు చాలా కాలం సంపాదకులుగా ఉండి ఆ పత్రిక ద్వారా మంచి సాహిత్యసేవ చేశారు. ఇల్లాలి ముచ్చట్లు అన్న శీర్షికను పురాణం సీత పేరుతో అనేక సంవత్సరాల పాటు నిర్వహించి అనేక విషయాల మీద (చైనా రాజకీయాల నుంచి-చీపురు కట్ట వరకు అని ఆట పట్టించేవారు అప్పుడు) రాజకీయ, సామాజిక, సాహిత్య, మానవ సంబంధ విషయాల గురించి వ్యంగం, హాస్యం మేళవించి వ్రాసేవారు.
రచనలు
[మార్చు]- కల కానిది-1969
- నీలి-1970 (ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రేడియోలో నాటికగా కూడా వచ్చింది)
- ఇల్లాలి ముచ్చట్లు
- జేబులో బొమ్మ-1972
- చంద్రునికో నూలు పోగు-1976[1]
- శివకాంత-1980
- రంగుల రామచిలక-1981
- మధురవాణి ఇంటర్వ్యూలు-1997
అభిప్రాయాలు
[మార్చు]- వంశీ-సినీ దర్శకుడు-నా దృష్టిలో పీఠికలు రాయడంలో అందెవేసిన దిట్ట శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు. ఏ పుస్తకానికి ఎలాంటి ముందుమాట, ఎటువంటి అంత్య వాక్యం రాయాలో-ఆ వ్యాకరణం తెలిసిన మహారచయిత, ఆయనలాగా ఎవరివల్లా రాయడం సాధ్యం కాదని నా నమ్మకం. (జయదేవ్ కార్టూన్లు సంపుటికి ఆప్త వాక్యం వ్రాస్తూ)
బయటి లింకులు
[మార్చు]- ↑ సుబ్రహ్మణ్యశర్మ, పురాణం. చంద్రుడికో నూలిపోగు.
వర్గాలు:
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- తెలుగు రచయితలు
- తెలుగు కథా రచయితలు
- కలం పేరుతో రచనలు చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- కృష్ణా జిల్లా పాత్రికేయులు
- కృష్ణా జిల్లా రచయితలు
- పత్రికలలో శీర్షికలు నిర్వహించినవారు