పురావస్తు శాస్త్రం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధాలాల్ని గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం. ఇందుకోసం త్రవ్వకాల్లో బయల్పడిన కళాఖండాలు, శాసనాలు, నిర్మాణాలు మొదలైన వాటి మీద పరిశోధన చేస్తారు. పురావస్తు శాస్త్రంలో రేడియోకార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ఒక వస్తువుయొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. కాని కొందరు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో లోపం ఉందని, కార్బన్ డేటింగ్ పరీక్ష ఖచ్చిత సమాచారం ఇవ్వదని రుజువుచేశారు.
ఈ శాస్త్రంలో మానవుల చరిత్ర, పూర్వ చరిత్ర గురించి అధ్యయనం చేస్తారు. అంటే తూర్పు ఆఫ్రికా, కెన్యాలో బయటపడ్డ 30 లక్షల సంవత్సరాల రాతిపనిముట్ల నుంచి ఇటీవలి కాలం నాటి పరిస్థితుల గురించి అధ్యయనం చేస్తారు. ఎటువంటి లిఖిత పూర్వక ఆధారాలు లేని పూర్వీకుల సమాజం, వారి జీవన విధానం గురించి తెలుసుకునేందుకు పురావస్తు శాస్త్రం చాలా కీలకమైనది. అసలు చరిత్ర లో 99% మానవ సమాజాల్లో అక్షర జ్ఞానం అభివృద్ధి కాక మునుపటి పరిస్థితుల్లో దాగి ఉంది.[1] వివిధ మానవ జాతుల సాంస్కృతిక చరిత్ర అర్థం చేసుకోవడం, పూర్వీకుల జీవన విధానాన్ని పునర్నిర్మించడం, వాటిని అక్షరబద్ధం చేయడం, కాలంతో పాటు జీవన విధానాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో పరిశోధించడం ఈ శాస్త్రం యొక్క ముఖ్య లక్షణాలు.
భూముల్ని సర్వే చేయడం, తవ్వకాలు జరపడం, అక్కడ కనిపించిన సమాచారాన్ని సమీకరించి విశ్లేషించి గతం గురించి మరింత తెలుసుకోవడం ఈ శాస్త్రంలోని ప్రధాన అంశాలు. ఇలా పరిశోధన చేయడానికి చరిత్ర, భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, సమాచార సాంకేతిక శాస్త్రం, గణాంక శాస్త్రం, భాషా శాస్త్రం లాంటి ఇతర శాస్త్రాల సహాయం కూడా తీసుకుంటారు.
యూరప్ లో 19 వ శతాబ్దంలో పురాతన వస్తువులను, ప్రదేశాలను, గ్రంథాలను అధ్యయనం చేయడం ప్రారంభించడంతో ఈ శాస్త్రం క్రమంగా అన్ని దేశాలకూ విస్తరించింది.
కొన్ని పురాతత్వ పరిశోధనలు
[మార్చు]ఆల్ప్స్ పర్వతాల్లో 5000 సంవత్సరాల క్రితం మరణించి, అక్కడి మంచులో కూరుకుని, ప్రకృతి సహజమైన మమ్మీగా మారిన పురుషుని మృతదేహంపై పురాతత్వవేత్తలు చేసిన పరిశోధన, దాని విశ్లేషణ గురించి మంచుమనిషిలో చూడవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ ఇక్కడికి దుముకు: 1.0 1.1 Renfrew and Bahn (2004 [1991]:13)
మూల గ్రంథాలు
[మార్చు]- Renfrew, C.; Bahn, P. G. (1991), Archaeology: Theories, Methods, and Practice, London: Thames and Hudson Ltd, ISBN 0-500-27867-9, OCLC 185808200