పురాన్ సింగ్
ప్రొఫెసర్ పురాన్ సింగ్ (1881–1931) ప్రముఖ పంజాబీ కవి, శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త. పాకిస్థాన్ లోని పొథోహార్ లో అహ్లువాలియా కుటుంబంలో జన్మించారు ఆయన. వీరి కుటుంబం ఆధునిక పంజాబీ సాహిత్యానికి ఆద్యులుగా పేర్కొంటుంటారు.[1] 1897లో రావల్పిండిలోని మిషన్ హై స్కూల్ లో మెట్రిక్యులేషన్ చదివారు. 1900-1903లో ఆయనకు వచ్చిన స్కాలర్ షిప్ తో టోక్యోలోని ఫార్మాసూటికల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం నుండి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా అందుకున్నారు పురాన్ సింగ్. పుట్టుకతో సిక్కు అయినా జపాన్ కు చెందిన బౌద్ధ సన్యాసి ఉకాకురా, స్వామీ రామతీర్థ్ ల ప్రభావంతో బౌద్ధ బిక్షువు, సన్యాసిగా మారారు ఆయన. కానీ 1912లో సైల్ కోట్ లో సిక్కు ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నప్పుడు భాయ్ వీర్ సింగ్ ప్రభావంతో సిక్కు ఆధ్యాత్మిక వేత్తగా మారారు పురాన్ సింగ్.
ఆధ్యాత్మికవేత్తగా..
[మార్చు]జపాన్ బౌద్ధ భిక్షువు, అమెరికా కవి వాల్ట్ వైట్ మేన్, స్వామీ రామ్ తీర్థ్, సిక్కు సాధువు భాయ్ వీర్ సింగ్ లతో పరిచయం, వారి ప్రభావం ఆయన జీవితంపై పడింది. జపాన్ లో చదువుకునేటప్పుడు ఆ దేశపు సంప్రదాయాలు, పండుగలు, ప్రకృతి సౌందర్యం, పరిశ్రమలు, జాతి సమగ్రత ఆయనను ఎంతగానో ఆకర్షించాయి. అమెరికా కవి వాల్ట్ పరిచయం ఆయనకు కవితా దృష్టిని ఏర్పరిచింది. రామ్ తీర్థ్ ఇచ్చిన మంత్రం తనను తనకు పరిచయం చేసినట్టుగా భావించారాయన. 1912లో భాయ్ వీర్ సింగ్ ను కలుసుకొన్నప్పుడు సిక్కు మతంపై ఆయన పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి తెచ్చుకున్నారు. ఆ తరువాత నుంచీ సిక్కు ఆధ్యాత్మికవేత్తగా మారారు పురాన్ సింగ్.
శాస్త్రవేత్తగా..
[మార్చు]నూనెలను వడబోసే ప్లాంట్ ఒకటి లాహోర్ లో స్థాపించారు పురాన్ సింగ్. ఇషార్ దాస్, రాయ్ బహద్దూర్ శివ్ నాథ్ ల సహకారంతో ఈ ప్లాంట్ ను పెట్టారు ఆయన. థైమోల్, ఫెన్నెల్, నిమ్మ నూనెలను తయారు చేసేవారు ఆక్కడ. ఈ వ్యాపారం ఆయన తల్లితండ్రులకు ఇష్టం లేకపోవడంతో, వారితో గొడవ పడి వ్యాపారం వదిలేసి, డెహ్రాడూన్ వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు స్వామీ రాం తీర్థ్ శిష్యునితో ఉన్నారు ఆయన. డిసెంబరు 1904లో లాహోర్ తిరిగి వెళ్ళి ఆక్కడ డైమండ్ వి.జె.హిందూ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కు ప్రిన్సిపల్ గా పని చేయడం మొదలుపెట్టారు. తిరిగి 1906లో ఉద్యోగానికి రాజీనామా చేసి, డెహ్రాడూన్ లో సబ్బుల ఫ్యాక్టరీ పెట్టారు పురాన్. కానీ కొన్నాళ్ళకు ఫ్యాక్టరీని అమ్మేశారు. తరువాత ఏప్రిల్ 1907లో డెహ్రాడూన్ లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఫారెస్ట్ కెమిస్ట్ గా ఉద్యోగంలో చేరి, 1918లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరువాత గ్వాలియర్ లోని ఎడారిలో దొరికే రోషా గ్రాస్, యూకలిప్టస్, పళ్ళ చెట్లను చూసి ఎంతో మురిసిపోయారు ఆయన. 1923-1924 మధ్యలో గ్వాలియర్ లోని సురయ్యాలో సర్ సుందర్ సింగ్ మజిథియాతో కలసి ఆయన పంచదార ఫ్యాక్టరీలో పనిచేశారు. పంచదారలు కాల్చిన ఎముకల పొడి కలపకుండానే ఎలా శుద్ధి చేయాలో ఒక వినూత్న పద్ధతిని కనుక్కున్నారు పురానా సింగ్. 1926లో నాంకనా సాహిహ్ వద్ద పంజాబ్ ప్రభుత్వం నుండి కొంత భూమి కౌలుకు తీసుకుని రోషా గడ్డి వ్యాపారం కోసం పెంచారు. 1928లో వరదలతో ఆయన పెంచిన పంటంతా కొట్టుకుపోయినా, తన పుస్తకాలను కాపాడుకొగలిగినందుకు సంతోషించారు ఆయన. ఈ నష్టాన్ని వేదాంతపరంగా తీసుకున్నారు పురాన్. ఈ సందర్భంగా ఒక కవిత కూడా రాశారు ఆయన. తన భవబంధాలు విముక్తి అయినట్టు భావించారు పురాన్.
కవిగా..
[మార్చు]ఆయన సైన్స్ లోనూ, సాహిత్యంలోనూ చేసిన కృషి సమానంగా ప్రాముఖ్యమైనది. ఆయన శాస్త్రవేత్తగా బిజీగా ఉన్నా సందర్శకులతోనూ, సన్యాసులకు, స్వాతంత్ర్య విప్లవకారులకూ తగినంత సమయం కేటాయించేవారు. వారికి అతిథి మర్యాదలు చేసేవారు. ప్రకృతి, సౌందర్య ప్రేమికుడైన పురాన్ సింగ్ ఆంగ్లంలోనూ, పంజాబీ భాషల్లోనూ కవితలు రాసేవారు.
1930లో టిబి బారిన పడ్డ పురాన్ సింగ్ 31 మార్చి 1931న డెహ్రాడూన్ లో చనిపోయారు.
సాహిత్యం
[మార్చు]1923లో ఖుల్హే మైదాన్, ఖుల్హే ఘుండ్, 1923లో ఖులే అస్మానీ రంగ్ అనే కవితా సంకలనాలు రాశారు ఆయన.[2] ఆయన కవిత్వంలో పేదలు, గ్రామస్థులు, రైతులే కథా వస్తువులు.[2] ఆంగ్లంలో ఆయన రాసిన ది సిస్టర్స్ ఆఫ్ ది సిపిన్నింగ్ వీల్ (1921), అన్ స్ట్రంగ్ బీడ్స్ (1923), ది స్పిరిట్ ఆఫ్ ఒనెంటల్ పొయెట్రీ (1926), పంజాబీలో ఖుల్హే మైదాన్, ఖుల్హే ఘుండ్ (1923), ఖుల్హే అస్మానీ రంగ్ (1927), ఖుల్హే లేఖ్ (1929) వంటి కవితా సంకలనాలు చాలా ప్రసిద్ధి చెందాయి. పురాన్ సింగ్ ఆంగ్లంలో ది బుక్ ఆఫ్ టెన్ మాస్టర్స్, ది స్పిరిట్ బార్న్ పీపుల్, స్వామీ రామా, పంజాబీలో ఖుల్లే లేఖ్ (1929), హిందీలో హోర్ లేఖ్ వంటి గద్య రచనలు కూడా చేశారు ఆయన.
రచనల జాబితా
[మార్చు]- అనెక్డోట్స్ ఫ్రం సిక్ హిస్టరీ (1908)
- సిస్టర్స్ ఆఫ్ ది స్పిన్నింగ్ వీల్ (1921)
- ఏన్ ఆఫ్టర్ నూన్ విత్ సెల్ఫ్ (1922)
- ఎట్ హిస్ ఫీట్ (1922)
- ఖుల్హే మైదాన్ 1923)
- ఖుల్హే ఘుండ్ (1923)
- అన్ స్ట్రంగ్ బీడ్స్ (1923)
- బ్రైడ్ ఆఫ్ ది స్కై (1924)
- ది స్టోరీ ఆఫ్ స్వామీ రామ్ తీర్థ్ (1924)
- నర్గిస్: సాంగ్స్ ఆఫ్ ఎ సిక్ (భాయ్ వీర్ సింగ్ రాసిన పాటల అనువాదం) (1924)
- ది బుక్ ఆఫ్ టెన్ మాస్టర్స్ (1926)
- ఖుల్హే అస్మానీ రంగ్ (1926)
- ది స్పిరిట్ ఆఫ్ ఓరియెంటల్ పొయెట్రీ (1926)
- స్పిరిట్ బార్న్ పీపుల్ (1928)
- సెవెన్ బాస్కెట్స్ ఆఫ్ ప్రోస్ పోయెమ్స్ (1928)
- ఖుల్హే లేఖ్ 1929)
- ఖల్సా డా ఆదర్ష్
- సిఖి దీ అత్మా
- గురు షబాద్ విస్మాద్ బోధ్
- జగ్దైన్ జోతాన్
- చుప్ ప్రీత్ డా షైహన్ షాహ్ బియోపారే
- అబ్చాలీ జోత్
- జిన్ కే చోలే రత్రే
- చరణ్ ఛుహ్
- కన్యాదాన్ తె హోర్ లేఖ్
- కర్నా ఖిర్యా విచ్ పంజాబ్
- దాస్ గురు దర్శన్
- లౌధే పెహర్ డా అతమ్ చింతాన్
- నౌలఖా హార్ ఆతే హోర్ కహనియన్
- సిఖి దా ప్రేనా సబుత్ వాల్ట్ వైట్ మేన్
- జిందగీ దే రహాన్ తే
ఆయన చనిపోయాకా ప్రచురించినవి..
[మార్చు]- గురు గోబింద్ సింగ్ రిఫ్లెక్షన్స్ అండ్ ఆఫరింగ్స్ (1967)
- ప్రకసినా, ఎ బుద్ధిస్ట్ ప్రిన్స్ (1980)
- ది టెంపుల్ టులిప్స్ (1980)
- ది స్పిరిట్ ఆఫ్ ది సిక్, మొదటి భాగం (1981)
- ది స్పిరిట్ ఆఫ్ ది సిక్, రెండో భాగం (1981)
- ఆన్ పాత్స్ ఆఫ్ లైఫ్ (ఆత్మకథ) (1982)
- వాల్ట్ వైట్ మేన్ అండ్ ది సిక్ ఇన్స్పిరేషన్ (1982)
మూలాలు
[మార్చు]- ↑ Jaspal Singh, "Spiritual journey of Prof Puran Singh", The Sunday Tribune, 24 November 2002
- ↑ 2.0 2.1 Singh, Atamjit.