Jump to content

పూడి శ్రీహరి

వికీపీడియా నుండి
పూడి శ్రీహరి
వృత్తివై.ఎస్. జగన్మోహన్ రెడ్డి యొక్క చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌

పూడి శ్రీహరి ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ప్రముఖ విలేఖరి, రచయిత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి యొక్క చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

విశాఖపట్నం జిల్లా మామిడిపల్లి (దేవరాపల్లి మండలం)లో పూడి శ్రీహరి జన్మించాడు. డిగ్రీ వరకు విశాఖ జిల్లాలోనే విద్యాభ్యాసం చేసారు. విశాఖ జిల్లా రూరల్ రిపోర్టర్ గా డిగ్రీ చివరి సంవత్సరంలో వృత్తిని ఆరంభించి ఆ తర్వాతి క్రమంలో డెస్క్ జర్నలిస్ట్, చీఫ్ న్యూస్ కో ఆర్డినేటర్, ఎడిటర్ గా పనిచేసారు.[2]

వృత్తి

[మార్చు]

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో అడుగడుగునా అంతరంగం అనే పుస్తకాన్ని 2019 లో రచించారు.[3] అసెంబ్లీ ఎన్నికలకి రెండేళ్ల ముందు నుండి వై ఎస్ జగన్ యొక్క మీడియా కార్యకలాపాల్ని పర్యవేక్షించిన పిమ్మట 2019 జూన్ 26 న ముఖ్యమంత్రి యొక్క చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా నియమితులయ్యారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "పూడి శ్రీహరి విచారణ అవసరం లేదని నిర్ణయానికొచ్చాం". ETV Bharat News. 2021-04-03. Retrieved 2021-11-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Varma, K. V. D. (2019-06-26). "సీఎం జగన్‌ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ గా పూడి శ్రీహరి". www.hmtvlive.com. Archived from the original on 2021-11-13. Retrieved 2021-11-17.
  3. "అడుగడుగునా అంతరంగం.. వైఎస్ జగన్ జీవితంపై పుస్తకం ఆవిష్కరణ". Samayam Telugu. 2019-04-04. Retrieved 2021-11-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "సీఎం వైఎస్‌ జగన్‌ సీపీఆర్వోగా పూడి శ్రీహరి". Sakshi. 2019-06-25. Retrieved 2021-11-17.