Jump to content

పూడూరి రాజిరెడ్డి

వికీపీడియా నుండి
పూడూరి రాజిరెడ్డి

హైదరాబాదులో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో రచయిత పూడూరి రాజిరెడ్డి
జననం:
వృత్తి:

పూడూరి రాజిరెడ్డి తెలుగు కథా రచయిత, పాత్రికేయుడు, కాలమిస్ట్.

బాల్యం

[మార్చు]

రాజిరెడ్డీ 1977 సెప్టెంబర్ 11న తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నరసింగాపురం గ్రామంలో పూడూరి లచ్చవ్వ(లక్ష్మి), పూడూరి రాంరెడ్డి దంపతులకు పుట్టారు.

విద్య, ఉద్యోగం

[మార్చు]

రాజిరెడ్డి నర్సింగాపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆరు-ఏడు తరగతులు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ లోని లక్ష్మమ్మ స్మారక విద్యాలయంలో చదివాడు. ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల(రెసిడెన్షియల్) పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ ఎంపీసీ హైదరాబాదులోని ఆలియాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బీఎస్సీ ఎంపీఈలో సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసాడు. 1999 జూలై నుంచి 2003 వరకు జూనియర్‌ ఇంజినీర్‌గా టీమ్‌ ఏసియా గ్రీవ్స్‌ సెమీకండక్టర్స్‌ లిమిటెడ్, పటాన్‌చెరు లో పని చేసాడు. ఆపై పాత్రికేయ వృత్తిలోకి వచ్చి 2003 డిసెంబర్‌ నుంచి 2007 డిసెంబర్‌ వరకు ఈనాడు తెలుగు దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పని చేసాడు. 2008 జనవరి నుంచి సాక్షి దినపత్రికలో పని చేస్తున్నాడు. సాక్షి పత్రికలో తొలి నాలుగేళ్ళు ఫన్‌డే ఇన్‌చార్జ్ గా, ఆ తరువాత ఐదున్నరేళ్ళు సాక్షి సాహిత్యం పేజీ ఇన్‌చార్జ్‌గా, ప్రస్తుతం సంపాదకీయం పేజీ విభాగంలో పని చేస్తున్నారు.

రచనా వ్యాసంగం

[మార్చు]

రాజిరెడ్డి ఇంటర్ లో ఉండగానే కథా రచన మొదలుపెట్టారు. ముఖ్యంగా కథా రచన వీరి ప్రక్రియ. పత్రికేయుడిగా వ్యాస రచన శైలిలో కూడా బాగా పని చేసారు.

కథలు

[మార్చు]

రాసిన కథల వివరాలు:

  1. ఆమె పాదాలు (1999)
  2. కథ కాని కథ (2002)
  3. నాలో(కి) నేను (2006)
  4. మరణ లేఖలు (2008)
  5. చింతకింది మల్లయ్య ముచ్చట (2009)
  6. చినుకు రాలినది (2010)
  7. కాశెపుల్ల (2010)
  8. రెండడుగుల నేల (2011)
  9. తమ్ముడి మరణం (2013)
  10. రెక్కల పెళ్లాం (2014)
  11. మంట (2015)
  12. శ్రీమతి సర్టిఫికెట్‌ (2017)
  13. దేహి (2017)
  14. బోర్లించిన చెప్పు (2017)
  15. గంగరాజం బిడ్డ (2018)
  16. రెండో భాగం (2018)
  17. కొట్టివేత (2019)
  18. ఫ్యామిలీ ఫొటో (2019)
  19. కొండ (2019)
  20. మెడిటేషన్‌ (2020)
  21. చిలుము (2021)
  22. ఎడ్డి (2022)
  23. ఎఱుక (2022)
  24. చిన్న సమస్య (2023)
  25. జీవగంజి (2023)