పూనం పాండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూనం పాండే
జననంపూనం పాండే
(1991-03-11) 1991 మార్చి 11 (వయసు 32)
ఢిల్లీ, భారతదేశం
ఎత్తు5 ft 7 in (1.70 m)
కేశాల రంగునలుపు
కళ్ళ రంగునలుపు
కొలతలు34-24-36 inches

పూనం పాండే ఒక భారతీయ రూపదర్శి, నటి. వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టల ద్వారా తరచు వార్తలలో నిలుస్తుంటుంది.

నేపధ్యము[మార్చు]

ఢిల్లీలో జన్మించింది. అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. 12 వ తరగతి తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010 లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో నిలిచింది. అలాగే ఒక ఫ్యాషన్ పత్రిక ముఖచిత్రంపై ఈవిడ చిత్రం దర్శనమిచ్చి పలువురు దృష్టిలో పడింది.[1][2]

2011 లో ఈవిడ చిత్రం 21 క్యాలెండర్ లలో ముద్రితమైంది. ఇందులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లాడ్‌రాక్స్ క్యాలెండర్ కూడా ఉంది.[3] భారతదేశంలో ముద్రితమయ్యే కింగ్‌ఫిషర్ క్యాలెండర్ లో 2011 లో ఈవిడ చిత్రం ప్రచురితమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 5 లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించిన తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రికలో అభ్యంతరకరంగా పోజులిచ్చిన ఈవిడ చిత్రాలు ప్రచురితమవడంతో మనదేశంలో చిన్నపాటి సంచలనం సృష్టించి సినీ నిర్మాతల దృష్టిని ఆకర్షించగలిగింది .[4]

వార్తలలో పూనం[మార్చు]

2013 ముంబై అత్యాచార ఘటన[మార్చు]

దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు తనను బాధ్యురాలిని చేయడం తగదని బాలీవుడ్ నటి పూనమ్ పాండే పేర్కొన్నారు. ఫోటోషూట్‌లలో అసభ్యకరంగా ఫోజులిస్తూ, మ్యాగజైన్ ముఖ చిత్రాలపై అర్ధ నగ్నంగా కనబడే పూనమ్ లాంటి తారల వల్లే దేశంలో అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని విమర్శల నేపథ్యంలో ఆమె పెదవి విప్పారు.

అత్యాచార ఘటనలు జరగడానికి తాను ఎంత మాత్రం బాధ్యరాలిని కాదన్నారు. ఐఎన్‌ఎస్‌తో ఆగస్టు 27న మాట్లాడిన ఆమె..’ రేప్ ఘటనలపై నన్ను బలిపశువుని చేస్తున్నారని, నా సినిమాలు ఎప్పుడు మహిళలను కించపరిచే విధంగా ఉండవన్నారు. ఇటువంటి దురాఘాతాలకు నా చిత్రాలు వ్యతిరేకమన్నారు.

ఆగస్టు 25, 2013న ముంబై ఫోటో జర్నలిస్ట్‌పై జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకిత్తించడంతో పూనమ్‌పై విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అత్యాచార ఘటనకి తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా .. బాధ్యురాలిని చేయడం బాధ కల్గిస్తుందన్నారు. అంతకముందు కూడా ఇటువంటి ఉదంతాలు జరగలేదా అని పూనమ్ ప్రశ్నించారు. గతంలో ఢిల్లీలో నిర్భయపై జరిగిన రేప్ ఘటనను కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలని ఎదురు ప్రశ్నించారు. దేశంలో చట్టాలు విఫలం చెందడం వల్లే ఇటువంటి ఘటనలు పునారావృతమవుతున్నాయని ఆమె మండిపడ్డారు.[5]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2013 నషా హిందీ తొలిచిత్రం[6]

మూలాలు[మార్చు]

  1. Poonam Pandey Gladrags Magazine Cover Page Hot Stills : hot photos on Rediff Pages
  2. "Meet Kingfisher model Poonam Pandey". Archived from the original on 2015-06-23. Retrieved 2013-07-22.
  3. Poonam Pandey to partially strip for Team India!
  4. Adults Only: Poonam Pandey Finally Goes Nude After KKR Win IPL-5 (PHOTO) - International Business Times
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-29. Retrieved 2013-08-31.
  6. Poonam Pandey: I enjoyed romancing a teenager in Nasha - Rediff.com Movies