పెదరెడ్డిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదరెడ్డిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం నరసరావుపేట
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ జగన్నాధం
పిన్ కోడ్ 522601
ఎస్.టి.డి కోడ్

పెదరెడ్డిపాలెం, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 ఆగస్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో జగన్నాధం, సర్పంచిగా ఎన్నికైనాడు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కృష్ణ బృందావనం[మార్చు]

పెదరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కశిందుల పూర్ణచంద్రరావు కుమారుడు బసవలింగేశ్వరరావు, వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. ఇతను గ్రామం లోని దాతల ఆర్ధిక సహకారంతో నిర్మించ తలపెట్టిన శ్రీ కృష్ణ బృందావనం ఆలయ నిర్మాణానికై ఒక అర ఎకరం భూమిని విరాళంగా ఇచ్చాడు. అమెరికాలో ఉంటున్న యతి జియ్యర్‌స్వామి, తన ఆధ్వర్యంలో గ్రామంలోని ఈ ఆలయం నిర్మించడానికై ఈ గ్రామానికి చేరుకున్నాడు. దాతలు కొందరు ఆలయంలో ప్రతిష్ఠించుటకై విగ్రహాలను అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసారు. ఈ ఆలయ నిర్మాణానికై 2017, జులై-27 గురువారంనాడు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమం సందర్భంగా గ్రామంలో 2017, జులై-7 శుక్రవారం నుండి ప్రతి దినం, సాయంత్రం 7 నుండి 10 గంటల వరకు గ్రామంలో భగవద్గీత, భాగవతం, వాల్మీకి రామాయణంలోని శ్లోకాల పఠనం, ప్రవచనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు.ఇంతకు ముందే స్వామీజీ ఆధ్వర్యంలో అమెరికాలో ఒక రంగనాథస్వామివారి ఆలయం నిర్మించబడింది. స్వామీజీ పూర్వాశ్రమంలో, అమెరికాలో 30 సంవత్సరాలపాటు వైద్యరంగంలో పనిచేసారు.

మూలాలు[మార్చు]