పెదవి దాటని మాటొకటుంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదవి దాటని మాటొకటుంది
దర్శకత్వంటి. గురుప్రసాద్‌
స్క్రీన్ ప్లేటి.జి.కీర్తి కుమార్
కథటి.జి.కీర్తి కుమార్
నిర్మాత
  • అదితి
  • టి.జి.కీర్తి కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంనామన్ - యతిన్
కూర్పునిర్మల్ కుమార్
సంగీతంజెనిత్ రెడ్డి
నిర్మాణ
సంస్థ
ఫిల్మ్ మోంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
27 జూలై 2018 (2018-07-27)
సినిమా నిడివి
124 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పెదవి దాటని మాటొకటుంది 2018లో తెలుగులో విడుదలైన సినిమా. ఫిల్మ్ మోంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అదితి, టి.జి.కీర్తి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు టి. గురుప్రసాద్‌ దర్శకత్వం వహించగా జెనిత్ రెడ్డి సంగీతమందించాడు. రావణ్ రెడ్డి, పాయల్‌ వాద్వా, విజయ నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 27న విడుదలైంది.[1]

తరుణ్‌ (రావణ్‌ రెడ్డి)కి చదువు అంటే అసలు ఇష్టం ఉండని అతడు చదువును మధ్యలోనే ఆపేసి ఖర్చుల కోసం ఓ సాఫ్ట్ వెర్ కంపెనీ లో జానిటర్ (ఫ్లోర్ క్లినర్)గా జాయిన్ అవుతాడు. స్కూల్ డేస్ లోనే అహనా (పాయల్ వాద్వా) తరుణ్ ను చూసి ఇష్టపడుతుంది. కానీ అతడు ఒప్పుకోడు. కానీ కొంతకాలం తరువాత అహనాను ఇష్టపడడం మొదలు పెడుతాడు. తరుణ్ అహనాకు తన ప్రేమను ఎలా వ్యక్త పరిచాడు ? చివరకి అహనా, తరుణ్ కలిసారా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]
  • రావణ్ రెడ్డి
  • పాయల్‌ వాద్వా
  • విజయ నరేష్
  • మోహన్ భగత్
  • మొయిన్ ఖాన్
  • నందు కుమార్
  • ప్రియాంక శుక్లా
  • గోవిందా రాజు
  • శుభ్ సైనీ

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఫిల్మ్ మోంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్
  • నిర్మాతలు: అదితి, టి.జి.కీర్తి కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి. గురుప్రసాద్‌[3]
  • సంగీతం: జెనిత్ రెడ్డి
  • సినిమాటోగ్రఫీ: నమన్-యతిన్

పాటలు

[మార్చు]
సంఖ్య పాట పేరు సాహిత్యం గాయకులు సమయం
1. "అరేయ్ అరే" రెహమాన్ సత్యప్రకాష్, జెనిత్ రెడ్డి 3:54
2. "సులభం సులభం" రెహమాన్ అభయ్ జోధ్‌పుర్కర్ 3:44
3. "దొబ్బే దొబ్బే" రాహుల్ రామకృష్ణ, శ్రీ జెనిత్ రెడ్డి 4:37
4. "మన్మథుడు థీమ్" బి. మధునందన్ జెనిత్ రెడ్డి 1:37
5. "వద్దు వద్దు" రెహమాన్ రాము 4:38
మొత్తం : 18:55

మూలాలు

[మార్చు]
  1. Zee Cinemalu (25 July 2018). "వీకెండ్ రిలీజెస్" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  2. Sakshi (27 July 2018). "'పెదవి దాటని మాటొకటుంది' మూవీ రివ్యూ". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  3. The Times of India (7 April 2018). "Short-film maker Guru Prasad turns director" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.

బయటి లింకులు

[మార్చు]