మోహన్ భగత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోహన్ భగత్
జననంఏప్రిల్ 11
వృత్తినటుడు
తల్లిదండ్రులుగోపాల్ రావు - సత్య వీరవెంకటలక్ష్మి

మోహన్ భగత్, (ఆంగ్లం: Mohan Bhagath) తెలుగు నాటకరంగ, టివి, సినిమా నటుడు.[1] 2018లో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమాలోని గెడ్డం పాత్రతో గుర్తింపు పొందాడు.[2]

జననం, విద్య[మార్చు]

మోహన్, ఏప్రిల్ 11న గోపాల్ రావు - సత్య వీరవెంకటలక్ష్మి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం దగ్గర పత్తిపాడు శివారు కాగులంపాడు గ్రామంలో జన్మించాడు.

వేలివెన్నులోని శశి రెసిడెన్షియల్ స్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడలోని నలంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, కాచిగూడ బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో బి.కామ్ చదివాడు. హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ థియేటర్‌ ఆర్ట్స్, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో పీజీ పూర్తిచేశాడు.[2]

నాటకరంగం[మార్చు]

థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పలు నాటకాలలో నటించాడు. 2009లో హైదరాబాదు విశ్వవిద్యాలయంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సహకారంతో రూపొందించిన షేక్స్‌పియర్ రచించిన మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్‌ అనే నాటకంలో నటించాడు. తెలుగు విశ్వవిద్యాలయంలో పిపీలికం, ఛల్ చల్ గుర్రం, కొక్కొకొకో వంటి నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించాడు.

టివిరంగం[మార్చు]

2011లో జెమిని టివిలో ప్రసారమైన మొగలిరేకులు సీరియల్‌లో మోహన్ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా శ్రావణ సమీరాలు (జెమిని), అంతఃపురం(ఈటివి) సీరియళ్ళలోని ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పాడు.[3] తెలుగు సినిమా డబ్బింగ్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నాడు.

సినిమారంగం[మార్చు]

సినిమాలు[మార్చు]

 1. 2016: బొమ్మల రామారం (అంజి)
 2. 2016: ఇన్ ది క్వెస్ట్ ఆఫ్ వర్టికల్ లిప్స్ (రవికిరణ్)
 3. 2017: నేనే రాజు నేనే మంత్రి (భగత్)
 4. 2018: మహానటి (శేఖర్)
 5. 2018: కేరాఫ్ కంచరపాలెం (గడ్డం)
 6. 2018: మను (ఆంథొని)
 7. 2018: సంజీవని (నరేష్‌)
 8. 2018: పెదవి దాటని మాటొకటుంది (విక్కీ)
 9. 2019: మహర్షి (శ్రీనివాస్‌)
 10. 2019: స్వా (జై)
 11. 2022: కనకం[4]

వెబ్ సిరీస్ లు[మార్చు]

 1. ముద్దపప్పు ఆవకాయ్ (మోహన్‌)
 2. పోష్ పోరిస్ (వెంగల్‌)

మూలాలు[మార్చు]

 1. "Mohan Bhagath : Supporting Actor Wiki, Bio, Filmography, Mohan Bhagath Movies List, Songs, Age, Videos". MovieGQ (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-06.
 2. 2.0 2.1 సాక్షి (10 September 2018). "హీరో లేడు.. విలన్‌ లేడు." www.sakshi.com. Archived from the original on 14 September 2018. Retrieved 6 June 2022.
 3. Chowdhary, Y. Sunita (2018-09-06). "Mohan Bhagath, Karthik Rathnam and Praneeta Patnaik pin their hopes on 'C/O Kancharlapalem'". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2018-09-07. Retrieved 2022-06-06.
 4. "I will take up even small roles if I like the characters: Mohan Bhagath - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 2020-04-22. Archived from the original on 2022-04-20. Retrieved 2022-06-06.

బయటి లంకెలు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.