వెంకటేష్ మహా
Appearance
వెంకటేష్ మహా | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా దర్శకుడు స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2011 - ప్రస్తుతం |
వెంకటేష్ మహా, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. 2018లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం,[1] 2020లో వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలకు దర్శకత్వం వహించాడు.
జీవిత విషయాలు
[మార్చు]వెంకటేష్ మహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జన్మించాడు. తన పదహారేళ్ళ వయసులో ఇంటినుండి వచ్చేసిన వెంకటేష్ మహా, వివిధ ఉద్యోగాలలో పనిచేశాడు.
సినిమారంగం
[మార్చు]2011లో వచ్చిన తీన్ మార్ సినిమాకు స్పాట్ బాయ్ గా పనిచేసిన వెంకటేష్ మహా, అదే సంవత్సరం వచ్చిన ఆకాశమే హద్దు సినిమాలో కూడా నటించాడు. నూతన నటులతో 2018లో కేరాఫ్ కంచరపాలెం సినిమా తీశాడు. ఈ సినిమా మొత్తం కంచరపాలెం గ్రామంలో చిత్రీకరించబడింది.[2][3] ఆ తరువాత, మలయాళ సినిమా మహేశ్ ఇంటే ప్రతికారం రిమేక్ గా 2020లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా తీశాడు.[4] సత్యదేవ్ కంచరాన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎక్కువభాగం అరకులోయలో చిత్రీకరించబడింది.[5][6]
సినిమాలు
[మార్చు]దర్శకుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | ఇతర వివరాలు |
---|---|---|
2018 | కేరాఫ్ కంచరపాలెం | |
2020 | ఉమామహేశ్వర ఉగ్రరూపస్య |
నిర్మాతగా
[మార్చు]సంవత్సరం | సినిమా | ఇతర వివరాలు |
---|---|---|
2022 | అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు | [7] |
2022 | మర్మాణువు |
నటుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2006 | సుందరానికి తొందరెక్కువ | ||
2011 | ఆకాశమే హద్దు | నారాయణ స్నేహితుడు | |
2020 | ఉమామహేశ్వర ఉగ్రరూపస్య | టీ షాపు ఓనర్ | అతిథి పాత్ర |
2023 | యాంగర్ టేల్స్ | ||
2023 | మార్టిన్ లూథర్ కింగ్ |
స్క్రీన్ ప్లే రచయితగా
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|
2021 | కేరాఫ్ కాదల్ | తమిళం | కేరాఫ్ కంచరపాలెం రీమేక్ |
2023 | మార్టిన్ లూథర్ కింగ్ |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ దర్శకుడు - తెలుగు | కేరాఫ్ కంచరపాలెం | నామినేట్ | [8] |
2021 | సైమా అవార్డు | ఉత్తమ దర్శకుడు - తెలుగు | ఉమామహేశ్వర ఉగ్రరూపస్య | నామినేట్ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Dundoo, Sangeetha Devi (February 27, 2018). "Venkatesh Maha bats for original, real-life inspired stories". The Hindu. Retrieved 18 April 2021.
- ↑ Kavirayani, Suresh (September 9, 2018). "C/o Kancharapalem movie review: This realistic film is worth a watch". Deccan Chronicle. Retrieved 18 April 2021.
- ↑ "C/o Kancharapalem Movie Review {4/5}: Let these voices raise!". The Times of India. Retrieved 18 April 2021.
- ↑ Dundoo, Sangeetha Devi (June 5, 2020). "Venkatesh Maha to showcase another close-to-reality story with Satyadev starrer 'Uma Maheswara Ugra Roopasya'". The Hindu. Retrieved 18 April 2021.
- ↑ Dundoo, Sangeetha Devi (July 13, 2020). "Appu Prabhakar: Venkatesh Maha didn't want anything glossed over". The Hindu. Retrieved 18 April 2021.
- ↑ "Uma Maheswara Ugra Roopasya movie review: Satyadev Kancharana delivers the goods". July 30, 2020. Retrieved 18 April 2021.
- ↑ Andhrajyothy (11 January 2022). "యంగ్ డైరెక్టర్ కూడా నిర్మాతగా బిజీ బిజీ". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ "Nominations for the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Retrieved 18 April 2021.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వెంకటేష్ మహా పేజీ