పెద్ద జొన్నవరం
పెద్ద జొన్నవరం, వైఎస్‌ఆర్ జిల్లా, దువ్వూరు మండలానికి చెందిన గ్రామం.[1] ఈ గ్రామం దువ్వూరు మండలానికి తలమానికం వంటిది.ఈ గ్రామం, దువ్వూరుకు 4 కి.మీ దూరంలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారికి (NH:18) పడమర దిశలో 2కి.మీ .దూరంలో ఉంది.
పెద్ద జొన్నవరం | |
— రెవిన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°51′23″N 78°37′54″E / 14.856398°N 78.631803°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | దువ్వూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,694 |
- పురుషులు | 827 |
- స్త్రీలు | 867 |
- గృహాల సంఖ్య | 495 |
పిన్ కోడ్ | 516175 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ భౌగోళికం[మార్చు]
గ్రామానికి ఉత్తర దిశగా మొదలై, పడమరదిక్కుగా తిరిగి, పిమ్మట దక్షిణ దిక్కుగా కుందు నది ప్రవహిస్తున్నది.
సమీప గ్రామాలు[మార్చు]
గ్రామానికి తూర్పు వైపు కిలో మీటరు దూరంలో వెంకుపల్లి అనే గ్రామం ఉంది.పడమర వైపు తొండలదిన్నె ఉంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల ఉన్నది, ఉన్నత విద్య (S.S.C) కై దువ్వూరు వెళ్ళాలి.
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
బస్సు సౌకర్యంలేదు.దువ్వూరునుండి ఆటోలు ఉన్నాయి.దువ్వూరునుండి మైదుకూరు, కడప, తిరుపతివైపుకు, అలాగే ఆళ్ళగడ్డ, నంద్యాల, కర్నూలు, హైదరాబాదు నగరాలకు బస్సులు లభించును.దగ్గరి రైల్వే స్టేషను యర్రగుంట్ల.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
వైద్య సౌకర్యం లేదు.మాములు రోగాలకై దువ్వూరు, అత్యవసర చికిత్సలకై, ప్రొద్దుటూరు, కడప, కర్నూలు వెళ్ళవలసి ఉంది.,
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]
గ్రామం మధ్యలో వేణుగోపాల స్వామి దేవాలయం.పడమర వైపుకు తొండలదిన్నె గ్రామం వెళ్ళు మార్గంలో ఆంజనేయ స్వామి గుడిఉన్నవి.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
కే.సి.కాలువ క్రింద వరి పండిస్తారు.మిగతా ప్రాంతంలో తెల్లనువ్వులు, పసుపు, పిల్ల పెసర పండిస్తారు.
గణాంకాలు[మార్చు]
జనాభా (2011) - మొత్తం 1,694 - పురుషుల సంఖ్య 827 - స్త్రీల సంఖ్య 867 - గృహాల సంఖ్య 495
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-07-31.