పెనుమత్స సాంబశివరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెనుమత్స సాంబశివరాజు

మాజీ మంత్రి

వ్యక్తిగత వివరాలు

మరణం 10 ఆగష్టు 2020
విశాఖపట్నం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి పెనుమత్స వెంకట రమణమ్మ
సంతానం నలుగురు పిల్లలు (పెన్మత్స సురేష్‌ బాబు)
వృత్తి రాజకీయ నాయకుడు

పెనుమత్స సాంబశివరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ మంత్రి.ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా రికార్డు సృష్టించాడు.సాంబశివరాజు బొత్స సత్యనారాయణ కు రాజకీయ గురువు.

జననం[మార్చు]

పెనుమత్స సాంబశివరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, మొయిద గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

పెనుమత్స సాంబశివరాజు 1957లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి మొయిద గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు.ఆయన 1959 ,1964 లో రెండు సార్లు నెల్లిమర్ల బ్లాక్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు.ఆయన 1967లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఎస్ నాయుడు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోకి అడుగు పెట్టాడు.సాంబశివరాజు 1972లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికై రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.పెనుమత్స సాంబశివరాజు 1978 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సతివాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.

ఆయన సతివాడ నియోజకవర్గం నుండి 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు. సాంబశివరాజు 1994లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలయ్యాడు. ఆయన తిరిగి 1999 మరియు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]ఆయన నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో షుగర్ ఇండస్ట్రీస్, సివిల్ సప్లయ్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, రవాణా శాఖ మంత్రిగా,ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండుసార్లు ప్రొటెమ్ స్వీకర్ గా పనిచేశాడు. ఆయన వృద్ధాప్యం కారణంగా 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు. ఆయన 2012లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడిగా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[2]

మరణం[మార్చు]

పెనుమత్స సాంబశివరాజు అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 10 ఆగష్టు 2020న మరణించాడు.[3][4][5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (14 March 2019). "ఎంతటి వారైనా..ఏడుకు తలొంచాల్సిందే." Sakshi. Archived from the original on 9 జూలై 2021. Retrieved 9 July 2021.
  2. Sakshi (11 August 2020). "సీనియర్‌ నేత పెనుమత్స కన్నుమూత". Sakshi. Archived from the original on 9 జూలై 2021. Retrieved 9 July 2021.
  3. Sakshi (10 August 2020). "పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత". Sakshi. Archived from the original on 9 జూలై 2021. Retrieved 9 July 2021.
  4. The New Indian Express (11 August 2020). "Eight-time MLA, YSRC leader P Sambasiva Raju passes away at 87 in Visakhapatnam". Archived from the original on 9 జూలై 2021. Retrieved 9 July 2021.
  5. Mana Telangana (10 August 2020). "మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి". Archived from the original on 9 జూలై 2021. Retrieved 9 July 2021.