పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెన్నా నది (అనంతపురం వద్ద)


పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు (పిఏబిఆర్), భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము అనంతపురం జిల్లా లో కూడేరు మండలం, కొర్రకోడు గ్రామం సమీపంలో పెన్నానది అంతటా ఉన్న ఒక నీటిపారుదల ప్రాజెక్టు.[1][2][3][4][5]

ఈ పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి కాలువ, యాడికి కెనాల్ సిస్టంల ద్వారా రెండు వైపులా 50,000 ఎకరాల చొప్పున నీటిపారుదల సౌకర్యాలు అందించడానికి నీటి 11.10 టిఎంసిల మేరకు నిల్వలకు, ఈ క్రమంలోనే ట్యాంకులు కింద పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి కాలువ సాగునీటి అవసరాల 7,500 ఎకరాల స్థిరీకరణ పాటు 40 మెగావాట్ల జల విద్యుత్ శక్తి ఉత్పత్తికి కింద దీనిని ప్రతిపాదించబడింది.

అనంతపురం నగరం పిఏబిఆర్ నుండి త్రాగు నీటిని అందుకుంటున్నది. రిజర్వాయర్ 305 మిలియన్ క్యూబిక్ మీటర్ల ప్రత్యక్ష నిల్వ సామర్థ్యం తోటి ప్రధానంగా తుంగభద్ర ఆనకట్ట నుండి ఉద్భవించిన తుంగభద్ర (హై) అధిక కాలువ ద్వారా 10 టిఎంసిల మేరకు నీటిని ఉంచుతారు.[6] 20 మెగావాట్ల జల విద్యుత్ పవర్ స్టేషను కూడా ఆనకట్ట స్థలం (సైట్) వద్ద నిర్మించారు. [7]

ప్రముఖ నీటిపారుదల ఇంజనీర్ కె. శ్రీరామక్రిష్ణయ్య 2002 సం.లో మరణం తరువాత , పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు యొక్క పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయన గుర్తు (మెమరీ)గా డాక్టర్ కె శ్రీరామక్రిష్ణయ్య పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని నామకరణం చేయడం జరిగింది.

విద్యుదుత్పత్తి[మార్చు]

పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) లోని జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి మొదలు పెట్టారు. ఈ విద్యుత్‌ కేంద్రంలో ఒక టర్బైన్‌లో ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి కావల్సిన 650 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. డ్యాంలోకి హెచ్‌ఎల్‌సీ నుంచి 650 క్యూసెక్కులు, జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి 690 క్యూసెక్కులు వస్తున్నాయి. అందువలన జలవిద్యుదుత్పత్తి ఈ కేంద్రంలో మొదలుపెట్టారు. ప్రస్తతం డ్యాంలో నీటి నిల్వ 1.9 టీఎంసీల వద్ద ఉంది. కుడికాలువకు 700 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటిమట్టం తగ్గుతుండటంతో గతంలో విద్యుదుత్పత్తి నిలిపేశారు. తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. [8]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

  1. http://www.hindu.com/2006/01/14/stories/2006011408050500.htm
  2. http://www.hindu.com/2011/02/04/stories/2011020457360300.htm
  3. http://www.hindu.com/2010/03/14/stories/2010031451760300.htm
  4. http://www.hindu.com/2011/01/01/stories/2011010161660300.htm
  5. http://www.hindu.com/2010/08/12/stories/2010081253910200.htm
  6. "PennaI Ahobilam (Dr._K.S.P.A.B.R.) dam, CWC WRIS data". Retrieved May 9, 2013. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-27. Retrieved 2015-05-12.
  8. http://www.andhrajyothy.com/Artical.aspx?SID=58252&SubID=64[permanent dead link]

వెలుపలి లంకెలు[మార్చు]