తుంగభద్ర ఆనకట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుంగభద్ర డ్యామ్

తుంగభద్ర ఆనకట్టను కృష్ణా నదికి ఉపనదియైన తుంగభద్ర నదిపై నిర్మించారు.[1][2]ఆనకట్ట కర్నాటకలోని హోస్పేట్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇది ఒక బహుళార్ధసాధక ఆనకట్ట, ఇది నీటిపారుదలకు, విద్యుత్ ఉత్పత్తికి, వరదలను నియంత్రించేందుకు ఇంకా తదితర సేవలకు ఉపయోగపడుతుంది. దీని నిర్మాణం 1943లో ప్రారంభమైనప్పుడు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం మరియు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీల యొక్క ఒక ఉమ్మడి ప్రాజెక్టు. తరువాత 1953లో దీని నిర్మాణం పూర్తయిన తరువాత ఇది కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్టుగా మారింది. ఈ ఆనకట్ట యొక్క ప్రధాన ఆర్కిటెక్ట్ డాక్టర్ తిరుమలై అయ్యంగార్, ఇతను మద్రాస్ కు చెందిన ఒక ఇంజనీరు.

కర్నాటకలోని బళ్లారి, రాయచూరు, ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు, అనంతపూర్ జిల్లాలకు నీటిని అందించేందుకు వీలుగా ఈ డ్యాం నుంచి లోలెవల్, హైలెవల్, లెఫ్ట్ బాంక్ కెనాల్స్ నిర్మించారు. ముఖ్యంగా లోలెవల్స్ అంటే ఎల్ ఎల్ సి కెనాల్ ను కర్నూలు జిల్లాకు తాగునీరు అందించేందుకు నిర్మించారు. ఖరీఫ్, రబీ సీజన్ లో ఎల్‌ఎల్‌సి కాలువ కింద సుమారు లక్షా 52 వేల ఎకరాల ఆయకట్టు ఉంది, 200 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది.

సాంకేతిక వివరాలు[మార్చు]

ఈ ఆనకట్ట తుంగభద్ర నదిపై, పూర్తి రిజర్వాయర్ స్థాయి (FRL) 498 మీటర్ల MSL వద్ద, స్థూల నిల్వ సామర్థ్యం 101 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల (టిఎంసి) తో, 378 చదరపు కిలోమీటర్ల నీటి విస్తృత ప్రాంతాన్ని కలిగిన ఒక పెద్ద జలాశయాన్ని సృష్టించింది.[3][4] ఈ ఆనకట్ట దాని లోతైన పునాది పైన 49.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. పూర్తిగా కర్నాటక రాష్ట్రంలో నీటిపారుదలకు రిజర్వాయర్ సరఫరా నీటిని వెలువరించేవి ఎడమ కాలువలు. కర్నాటకకు మరియు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాలకు నీటిపారుదల సౌకర్యానందించేందుకు తక్కువ స్థాయిలో ఒకటి, అధిక స్థాయిలో మరొకటి రెండు కుడి బ్యాంకు కాలువలు నిర్మించబడ్డాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. https://en.wikipedia.org/wiki/Tungabhadra_Dam
  2. Map of Krishna River basin
  3. KWDT-1 and KWDT-2 reports
  4. Blue Print for Godavari River Water Utilization in Andhra Pradesh