పెన్మెత్స సుబ్బరాజు
పెన్మెత్స సుబ్బరాజు (జ.1958 ఫిబ్రవరి 11) "పియస్సార్" గా సుపరిచితుడు[1]. అతను హేతువాద నాయకుడు[2], రచయిత, అనువాదకుడు. అతను బైబిల్, క్రైస్తవ ఫండమెంటలిజాన్ని విమర్శిస్తూ పుస్తకాలు రాశాడు. అతను చాలా సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను బైబిల్‌తో పాటు హేతువాదం, గెలీలియో, డార్విన్ జీవితాలపై బుక్‌లెట్లు, అలాగే భారతదేశంలో వివాహ చట్టాల విశ్లేషణలు, అనువాదాలు చేసాడు.
జీవిత విశేషాలు
[మార్చు]సుబ్బరాజు తూర్పు గోదావరి జిల్లా పలివెలలో 1958 ఫిబ్రవరి 11న జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరులో స్థిరపడ్డాడు[3]. బైబిల్ పై అనేక విమర్శనా గ్రంథాలు రాశాడు. హేతువాది జాన నాగేశ్వరరావుతో కలిసి నేత్రదాన సంఘం (సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఐ డొనేషన్) పెట్టాడు. ఈ అసోసియేషన్ ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్‌తో అనుబంధంగా ఉంది[4]. రావిపూడి వెంకటాద్రితో కలిసి ఆంధ్రప్రదేశ్ లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర రాశారు. ఈ పుస్తకాన్ని తెలుగు అకాడమి 2003లో ప్రచురించింది. అతని కుమారుడు విజ్ఞాన్‌కు మంగళగిరికి చెందిన హేతువాది రేఖా చంద్రశేఖరరావు కుమార్తె దీప్తి లకు 2009 మార్చి 8న న మంత్రాలు లేకుండా కులాంతరవివాహం చేశాడు. ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లు.
రచనలు
[మార్చు]- బైబిలు దేవుడి ఆటకట్టు 1995
- నా పరిశీలనలో బైబిల్ 1996
- బైబిల్ ఏమంటున్నది? 1999
- దైవదర్శిని[5]
- బైబిల్ ఇదే[5]
- బైబిల్ దర్శిని (అనువాదం) [6]
మూలాలు
[మార్చు]- ↑ Binder, Stefan (2020-04-09). Total Atheism: Secular Activism and the Politics of Difference in South India (in ఇంగ్లీష్). Berghahn Books. ISBN 978-1-78920-675-3.
- ↑ "Penmetsa Subbaraju". Ranker (in ఇంగ్లీష్). Retrieved 2020-06-12.[permanent dead link]
- ↑ "Fictious Bible". www.geocities.ws. Retrieved 2020-06-12.[permanent dead link]
- ↑ Hiram, Epimetheus Christer (October 2011). Penmetsa Subbaraju (in ఇంగ్లీష్). Placpublishing. ISBN 978-613-7-82651-5.
- ↑ 5.0 5.1 "యువత హేతుబద్ధంగా ఆలోచించాలి - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-12. Retrieved 2020-06-12.
- ↑ జి. డబ్ల్యూ.ఫూట్(మూలం), డబ్ల్యూ పి బాల్(మూలం) (1986-10-01). బైబిలు [[దర్శిని]] 3.అత్యాచారాలు.
{{cite book}}
: URL–wikilink conflict (help)
భాహ్య లంకెలు
[మార్చు]- "నాస్తికత్వం హేతువాదం మానవవాదం : పెన్మెత్స సుబ్బరాజు". www.youtube.com. Retrieved 2020-06-12.