Jump to content

పెమ్మరాజు రామారావు

వికీపీడియా నుండి

పెమ్మరాజు రామారావు ప్రముఖ రంగస్థల నటుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన 1908 లో ఎమెచ్యూర్ నాటక సమాజం ప్రదర్శించిన గయోపాఖ్యానం నాటకంలో పాత్రధారణతో తన నటజీవితాన్ని ప్రారంభించాడు. అటుపిమ్మట ధృతరాష్ట్రుడు, చెకుముకిశాస్త్రి, అలెగ్జాండర్, అగ్నిహోత్రావధానులు, కర్ణుడు, కరటకశాస్త్రి, పేరిగాడు, తహశీల్దారు వంటి పురుష పాత్రలతో పాటు, చిత్రనళీయంలో భారతి, రసపుత్రవిజయంలో కేసర బేగం, సుభద్రగా, అనసూయగా, తులాభారంలో జాంబవతిగా, చింతామణిలో శ్రీహరిగా ఎన్నో స్త్రీ పాత్రలను అత్యద్భుతంగా నటించిన సవ్యసాచిగా ప్రశంసలు అందుకున్నాడు. తెలుగు నాటకాలే కాకుండా ఇంగ్లీషులో ఒథెల్లో, మాక్‌బెత్ వంటి నాటకాలలో కూడా ఆయన ప్రతిభను ప్రదర్శించాడు.

ఈయన సుమారు 500 నాటక ప్రదర్శనలలో విభిన్న స్త్రీ పురుష పాత్రలను పోషించాడు.

ఈయన ద్రోణంరాజు కామేశ్వరరావు, అంకరాజు శంకరరావు, మాచిరాజు రామచంద్రమూర్తి, టి.కె.వరాహస్వామి, బుద్ధవరపు కురంగేశ్వరరావు, మహిపాల రామన్న పార్సీ శేషగిరిరావు మొదలైన సుమారు 50 మంది సమాజ సభ్యులను తీర్చిదిద్దాడు.

ఈయన 1971 డిసెంబర్ 12 తేదీన హైదరాబాదులో పరమపదించాడు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]