Jump to content

విస్ఫోటం

వికీపీడియా నుండి
(పేలడం నుండి దారిమార్పు చెందింది)
ఒక ఏర్ షో లో గేసోలిన్ బాంబులు జారవిడిచి, సృష్టించిన ప్రేలుళ్ళు.

విస్ఫోటం లేదా ప్రేలుడు (పేలుడు) (Explosion) అంటే కొన్ని పదార్ధాలు ఒక్కసారిగా ఘనపరిమాణము పెరిగి పెద్ద శబ్దంతో అధిక శక్తిని విడుదల చేసే ప్రక్రియ. వివిధ రకాల బాంబులు, కొన్ని రసాయన పదార్ధాలు, వాయువులు ఇలా పేలే లక్షణాన్ని కలిగివుంటాయి. వీటి మూలంగా విడుదలైన శక్తి తరంగాలు, వేడి, వాయువుల ఆధారంగా విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది.

పేలుళ్ళలో రకాలు

[మార్చు]

ప్రకృతిసిద్ధమైనవి

[మార్చు]

విస్ఫోటాలు ప్రకృతిలో కూడా జరుగుతాయి. వీనిలో అగ్నిపర్వతాలు అతి ముఖ్యమైనవి. మాగ్మాలో కరిగియున్న వాయువులు దీనికి ప్రాధానమైన కారణము. లావా పైకి వస్తున్నప్పుడు ఈ వాయువులు బయటకు వచ్చి ఒకేసారి శక్తివంతమైన పేలుడు సంభవిస్తుంది.

రసాయనమైనవి

[మార్చు]

కృత్రిమంగా జరిగే విస్ఫోటాలలో రసాయనికమైనవి అతి సామాన్యమైనవి. గన్ పౌడర్ అన్నింటి కన్నా ముందుగా ఉపయోగంలోకి వచ్చింది. నైట్రోసెల్యులోజ్ (1865), డైనమైట్ (1866) 19 వ శతాబ్దంలోని ముఖ్యమైన ప్రేలుడు పదార్ధాలు.

అణుసంబంధమైనవి

[మార్చు]

అణ్వాయుధాలు ముఖ్యంగా అణువుల యొక్క విచ్ఛిత్తి వలన ఉత్పన్నమైన అపారమైన శక్తిని ఉపయోగిస్తాయి. అణుబాంబులు అత్యంత శక్తివంతమైనవి. ఇవి కొన్ని నగరాల్ని క్షణాల్లో నాశనం చేయగలవు.

విద్యుచ్ఛక్తి

[మార్చు]

అధిక వోల్టేజీ విద్యుత్తు వాహకాల మధ్య ఏర్పడిన లోపాల మూలంగా ఏర్పడిన ఆర్క్ ల మూలంగా అధిక శక్తివంతమైన లోహాలు, ఇన్సులేషన్లు మొదలైనవి కరిగిపోతాయి. ట్రాన్స్ ఫార్మ్ లలో జరిగే ప్రేలుడ్లు ఇలాంటివి.

అంతరిక్షంలో

[మార్చు]

విశ్వంలో సంభవించిన అతి శక్తివంతమైన విస్ఫోటం సుపర్ నోవా పేలుడు. గ్రహాలన్నీ మహా విస్ఫోటం నుండి జన్మించాయని ఒక ప్రతిపాదన.

సుర్యుని ఉపరితలం మీద, ఇతర నక్షత్రాల మీద జరిగే పేలుళ్ళు ఇలాగే చాలా శక్తివంతమైనవి. ఇవి విపరీతమైన ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేస్తాయి.

యాంత్రికమైనవి

[మార్చు]

అధిక ఒత్తిడిలో నిలవచేయబడిన వాయువుల సిలెండర్లు పేలడం యాంత్రికమైనవిగా పరిగణిస్తారు. అయితే సిలెండర్ లో ఉన్న వాయువును బట్టి కూడా వీటి ప్రమాదాలు మారతాయి. వంట గ్యాస్ (మీథేన్) సిలెండర్ పేలుడు కొంత వరకు యాంత్రికమైనవి. అయితే అగ్నిప్రమాదంతో కలిసినప్పుడు ఇవి ఇంకా ప్రమాదంగా పరిణమిస్తాయి. ప్రొపేన్ సిలెండర్ పేలినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం జరుగుతుంది.

బాంబుల్ని నిర్వీర్యం చేసే రోబో లు

[మార్చు]

యుద్ధ క్షేత్రాల్లో రహదారుల వెంబడి అమర్చిన బాంబుల్ని, బాంబు నిర్వీర్యక సిబ్బంది చేతి కదలికల్ని రోబోలు అనుకరించి బాంబును నిర్వీర్యం చేస్తాయి. బాంబు నిర్వీర్యక దళం బాంబు అమర్చిన ప్రాంతానికి తగినంత దూరంలో ఉంటారు. దీంతో ప్రమాదం బారిన పడే అవకాశం ఉండదు. 20 సూక్ష్మ మోటార్ల సాయంతో రోబో పనిచేస్తుంది. (ఈనాడు19.10.2009)

"https://te.wikipedia.org/w/index.php?title=విస్ఫోటం&oldid=3595283" నుండి వెలికితీశారు