Jump to content

పొట్నూరు సూర్యనారాయణ

వికీపీడియా నుండి
పొట్నూరు సూర్యనారాయణ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 2004
నియోజకవర్గం సతివాడ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1942
పాలవలస గ్రామం, గుర్ల మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 15 ఆగష్టు 2018
విశాఖపట్నం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పొట్నూరు సన్యాసినాయుడు, ఆదెమ్మ
జీవిత భాగస్వామి కనకమ్మ
సంతానం సన్యాసినాయుడు, వరహలమ్మ, ఆదెమ్మ, జ్యోతి

పొట్నూరు సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సతివాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం

[మార్చు]

పొట్నూరు సూర్యనారాయణ 1942లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, గుర్ల మండలం, పాలవలస గ్రామంలో పొట్నూరు సన్యాసినాయుడు, ఆదెమ్మ దంపతులకు జన్మించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పొట్నూరు సూర్యనారాయణ 1962 గూడేం సోసైటీ అధ్యక్షుడుగా ఎన్నికై అనంతరం పాలవలస గ్రామ సర్పంచ్‌గా 1974లో ఎన్నికై 22 ఏళ్లు పాటు పని చేశాడు. ఆయన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీపీగా పోటీ చేసి ఓడిపోయాడు. పొట్నూరు సూర్యనారాయణ 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సతివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పెనుమత్స సాంబశివరాజు చేతిలో ఓడిపోయాడు. ఆయన 1994లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి పెనుమత్స సాంబశివరాజుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] పొట్నూరు సూర్యనారాయణ 1999, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలై తరువాత రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరి అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత వైసీపీలో చేరాడు.

మరణం

[మార్చు]

పొట్నూరు సూర్యనారాయణ వృద్దాప్యం కారణంగా అనారోగ్యంతో విశాఖపట్నంలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15 ఆగష్టు 2018న మరణించాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 March 2019). "ఎంతటి వారైనా..ఏడుకు తలొంచాల్సిందే." Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  2. Andhrajyothy (16 August 2018). "టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. శోకసంద్రంలో పాలవలస". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  3. Sakshi (16 August 2018). "మాజీ ఎమ్మెల్యే పొట్నూరు మృతి". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.