పొడపత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పొడపత్రి
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
జి. సిల్విస్టర్
Binomial name
జిమ్నిమా సిల్విస్టర్

పొడపత్రి ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం 'జిమ్నిమా సిల్విస్టర్'., అపోసైనేసి కుటుంబానికి చెందినది. ఇది భారతదేశంలో ప్రకృతి సిద్ధంగా అరణ్యాలలో పెరుగుతంది. దీనిని సంస్కృతంలో "మేషశృంగి" అని పిలుస్తారు. అంతే కాకుండా "పుట్టభద్ర" / "మధునాశని" అని కూడా అంటారు. జింనిమా సిల్విస్ట్రి అనేది ఒక ప్రఖ్యాతమైన మొక్క. ఈ మొక్కని గుర్మర్ అని అంటారు.గుర్మర్ అంటే హిందీ వాడుకంలో మధుమేహాన్ని చంపేది అని అర్దం.వీటి ఆకులు ధీర్ఘవృత్తాకారంలో,సన్నగా ముక్కల వలె వుంటాయి.ఆకులు మృదువుగా వుంటాయి.పువ్వులు లేత పసుపు రంగులో,గుండ్రాటి ఆకారంలో వుంటాయి.పువ్వులు ఏకనాభిలో పక్కగా ఎర్పడి వుంటాయి.ఏకనాభి యొక్క కాడ పొడుగుగా వుంటాయి. రక్షక పత్రాలు పొడుగుగా,గుండ్రంగా వుంటాయి.

లక్షణాలు

[మార్చు]
  • బలహీన కాండపు తీగజాతికి చెందిన మొక్క.
  • లేటెక్స్, కేశయుత సరళ పత్రాలు, ఆభిముఖం, అండాకార దీర్ఘ వృత్తాకారం.
  • పసుపు పచ్చని గుత్తులుగా పూసే చిన్న పుష్పాలు.
  • 5-7 సెం.మీ. కాయలు మేక కొమ్ముల ఆకారంగా అమరి ఉంటాయి.

ఉపయోగాలు

[మార్చు]
  • పొడపత్రి ఆకులలో జిమ్నిమిక్ ఆమ్లం ఉంటుంది. ఇది తీపి రుచిని నివారిస్తుంది.
  • దీనిని మూత్ర వర్ధకంగాను, ఉత్తేజకారిగాను, జీర్ణకారిగాను, మలబద్ద నివారిణిగాను ఉపయోగిస్తారు.
  • ఇది గుండెను, ప్లీహాన్ని ఉత్తేజపరుస్తుంది. దీనిని మధుమేహంలో, జ్వరం, ఉబ్బసము నివారణ కోసం వాడుతారు.
  • ఈ మొక్క నుండి వొచిన సారం ప్రాచీన ఆయుర్వేద మందుగా ఇండియా,జపాన్, ఆస్ట్రేలియా దేశాలలో ఉపయోగిస్తారు.
  • ఈ మొక్క యొక్క ఆకులు ద్వారా మధుమేహం అనే వ్యాధిని దూరం చేయవచ్చు.

సాగుచేయు విధానము

[మార్చు]

పొడపత్రి అడవుల్లో సహజసిద్ధంగా లభ్యమౌతుంది. అయితే మార్కెట్లోని గిరాకీ మూలంగా దీనిని సాగుచేయవచ్చును.[1] పొడపత్రిని విత్తనాల ద్వారా సాగుచేయవచ్చును. మొదట నారుమళ్ళను చేసుకొని, ఆరోగ్యంగా వుండే పిల్ల మొక్కలను పొలాల్లో నాటుకోవాలి. విత్తనాలు సాధారణంగా 7-10 రోజుల్లో మొలకెత్తుతాయి. మొలకెత్తిన 4-5 వారాల తర్వాత నేలను సిద్ధము చేసుకొని, చాళ్ళు దున్నుకొని 1-2 మీటర్ల నిడివిలో పిల్ల మొక్కల్ని నాటుకోవాలి. ఇవి ఎగబ్రాకడానికి ఊతకర్రలను మొదట్లో ఒక పందిరిలాగ ఏర్పాటుచేస్తే పొడపత్రి పందిరంతా అల్లుకొని పొదలాగా తయారౌతుంది.

ఒక్క చెట్టు నుండి 250 గ్రాముల నుండి 5-6 కిలోల ఆకులు సేకరించవచ్చును. మొక్క పుష్పించు దశలో ఆకులను సేకరించవలెను. సేకరించిన ఆకులను నీడలో ఆరబెట్టి, ఎండిన తరువాత గోతాలలో భద్రపరచుకొనవలెను. మొక్కలు అల్లుకొనే దశలో లేదా పుష్పించే దశలో వేపపిండి నీళ్ళలో కరిగించి వడియగట్టి చల్లడం వలన చీడ పీడలు నివారించవచ్చును.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. పొడపత్రి, ఔషధ మొక్కల సాగు - సావకాశాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2004, పేజీ: 79-80.
"https://te.wikipedia.org/w/index.php?title=పొడపత్రి&oldid=3879544" నుండి వెలికితీశారు