పొరటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Omelette
FoodOmelete.jpg
Plain omelette with garnish
మూలము
ఇతర పేర్లుOmelet
మూలస్థానంFrance
వంటకం వివరాలు
వడ్డించే విధానంBreakfast, brunch
వడ్డించే ఉష్ణోగ్రతHot
ప్రధానపదార్థాలు Eggs, butter or oil
వైవిధ్యాలుvarious

ఆహారాలలో, పొరటు అనేది గిలకగొట్టిన గ్రుడ్డులను, నూనె లేదా వెన్నతో పెనంలో వేపి (పిసికిన  గ్రుడ్డులా కాకుండా)తయారుచేసే ఒక తినుబండారం. సాధారణంగా పొరటులోపల కిలాటం, చైవులు, కూరగాయలు, పుట్టగొడుగులు, మాంసం (పంది లేదా గొర్రె)మొదలైనవాటిని పెట్టి గొట్టంలా చుడతారు. దీనిని పూర్తి గ్రుడ్డును లేదా కేవలం గ్రుడ్డు తెలుపును మాత్రమే, కాస్త పాలు, మీగడ లేదా నీటితో కలిపి గిలకగొట్టితయారు చేస్తారు.

చరిత్ర[మార్చు]

నేటి సుతిమెత్తని పొరటు, పూర్వకాలపు పొరటుకు మెరుగుపరుచబడిన వంటకము. ఆలన్ డేవిడ్సన్ అనే వ్యక్తి ప్రకారం, పరాస (ఫ్రెంచ్) పదమైన యీ "ఆమ్లెట్" (పొరటు) 16వ శతాబ్దం మధ్యలో వాడుకలోకి వచ్చింది, కాని "అలుమెల్", "అలుమెట్" అనే పదాలు "ల మేనేజర్ ద ప్యారిస్" అనే పరాస పుస్తకంలో 1393లో వాడబడ్డాయి. ఆ పదాలు "ఫ్రాంకోయిస్ పియర్ లా వారెన్న్" అనేవాడు వ్రాసిన "ల క్విజినీర్ ఫ్రాంకోయిస్" అనే పుస్తకంలో ఔమెలెట్గా మారి,చివరకు నేటి ఆమ్లెట్ అనే పదంగా "క్విజీన్ బోర్గోయిస్" అనే పుస్తకంలో రూపుదిద్దుకున్నాయి.  

జానపద కథల ప్రకారం, నెపోలియన్ బోనాపార్టే, అతని సైన్యం దక్షిణ పరాస దేశం వైపు పయనిస్తున్న సమయంలో ఒక రాత్రి "బెసెయిర్స్" అనే పట్టణంలో బసచేయగా, ఆ ఊరివ్యక్తి ఒకడు వండిన ఈ పొరటును తిని ఎంతో ఇష్టపడ్డారట.పిమ్మట అతను ఆ ఊరిప్రజల నందరిని గ్రుడ్లు పోగుచేసి తన సమస్త సేన కోసం ఈ పొరట్లు, తినడానికి వేయించాడట.

కవిలలు(రికార్డులు)[మార్చు]

1994 మార్చి 19న యోకొహామా, జపానులో ఏకకాలంలో ప్రపంచంలోకల్లా అతిపెద్ద (1,383 చదరపు అడుగులు లేదా 128.5 చదరపు మీటర్లు) పొరటును, లక్షారవై వేల గ్రుడ్లతో చేశారు. కాని దానికంటే బరువైన (2,950 కిలోల) పొరటును "కెనడా శ్వాసకోశ సంఘం",  2002 మే 11న బ్రొక్విల్, ఒంటారియో, కెనడాలోని  "బ్రొక్విల్ స్మృతి కేంద్రంలో" తయారుచేసింది. ఆ రికార్డును బద్దలుగొడుతూ  2002 ఆగస్టు 11న సాంతారేం, ఒళంద దేశం (పోర్చుగల్)లోని "ఫెరేరా దో జెజేర్ పురపాలక సంఘం" 6,466 కిలోల పొరటును లక్షానలభై ఐదు వేల గ్రుడ్లతో ముప్ఫైనాలుగు అడుగుల అడ్డుకొలత (డయామీటర్)గల పెనంమీద వేసింది.

చిత్రజాలం[మార్చు]

ఇతరపదార్థాలు

Omelette, plain
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి657 kJ (157 kcal)
0.7 g
12 g
10.6 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ - ఎ
22%
172 μg
థయామిన్ (B1)
9%
0.1 mg
రైబోఫ్లావిన్ (B2)
33%
0.4 mg
నియాసిన్ (B3)
1%
0.1 mg
పాంటోథెనిక్ ఆమ్లం (B5)
24%
1.2 mg
విటమిన్ బి6
8%
0.1 mg
ఫోలేట్ (B9)
10%
39 μg
విటమిన్ బి12
46%
1.1 μg
కోలీన్
43%
212 mg
విటమిన్ ఇ
5%
29 IU
Vitamin E
8%
1.2 mg
విటమిన్ కె
4%
4.5 μg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
5%
47 mg
ఇనుము
12%
1.5 mg
మెగ్నీషియం
3%
10 mg
ఫాస్ఫరస్
23%
162 mg
పొటాషియం
2%
114 mg
సెలేనియం
38%
26.7 μg
సోడియం
11%
161 mg
జింక్
9%
0.9 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు75.9 g
Cholesterol356 mg

Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database
 • "నర్గేసీ" లేదా "పాలకూర పొరటు", అనేది వేపిన ఉల్లిపాయలు, పాలకూర, ఉప్పు, వెల్లుల్లి, మిరియాలుపొడితో చేసే ఒక ఇరాను వంటకం
 • "బఘలా ఘటోఘ్", అనే ఒక ఇరాను వంటకం, బఘలాలు (ఒక రకం చిక్కుడుకాయలు), దిల్ (ఒక రకం ఆకుకూర), గ్రుడ్లు, ఇతర తాలింపు సామానుతో చేయబడుతుంది.
 • "చీనా పొరటు", అనేది కేవలం గ్రుడ్లతో గాని లేదా ఆల్చిప్పలతో చేయబడుతుంది
 • "డెంవర్ పొరటు" లేదా "నైరుత్య పొరటు" లేదా "పశ్చిమ పొరటు", అనేది గ్రుడ్లతోపాటు పందిమాంసం, ఉల్లిపాయలు, పచ్చ బుట్టమిరపకాయలు (క్యాప్సికం)తో చేయబడి అప్పుడప్పుడు కిలాట (చీజ్)తురుము, బంగాళదుంప వేపుడుతో అమెరికా నైరుత్యదిశపు రాష్ట్రాలలో తినబడుతుంది.
 • "హ్యాంగ్ టౌన్ ఫ్రై" అనే ఒక అసామాన్య పొరటు నత్తగుల్లలు, పందిమాంసంతో ప్లేసర్విల్, కాలిఫోర్నయాలో తయారుచేయబడింది. 
 • "తెల్లసొన పొరటు" అనే రకపు పొరటులో గ్రుడ్డు యొక్క పసుపుభాగాన్ని తీసివేసి (ఎందుకంటే దానిలో ఎక్కువ కొవ్వుపదార్థముంటుంది గనుక) తయారుచేయబడింది.
 • "పరాస పొరటు" (ఫ్రెంచామ్లెట్) అనే రకం పొరటు, అతివేడిగానున్న పెనంపై త్వరగా, సున్నితంగా వండబడే పొరటు. ఆ పొరటుపై ఉప్పు, మిరియాలపొడి, తరిగిన టమాటాలు, కొన్ని సుగంధ ఆకుకూరలు (కొత్తిమీర, పుదీనా వంటివి)వేసి తింటారు
 • "యవన పొరటు" (గ్రీసామ్లెట్)లో పెనంపైవేపిన కూరలు, పాస్తా, మిగిలిపోయిన ఇతర తిండిపదార్థాలు వేసి ఆపైన గిలకగొట్టిన గ్రుడ్లు కలిపి వండుతారు. ఇతర రకాల పొరటులలా గ్రుడ్డుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఈ యవన పొరటును రాత్రి మిగిలిపోయిన తిండిపదార్థాలను మరలా సద్వినియోగం చేసుకోవడానికి చేస్తారు.
 • "ఫ్రిటాటా" అనే ఒక రకపు పొరటును చుట్టకుండా  ఒక దోసలాగ కిలాటం (చీజ్), కూరలు లేదా రాత్రి మిగిలిపోయిన పాస్తాను వేసి మెల్లగా చిన్నమంటపై వండుతారు. వంటనూనె తప్ప మిగిలిన పదార్థాలను గ్రుడ్డుతోనే కలిపి పెనంమీద పోస్తారు.
 • స్పైయిన్ దేశపు "టోర్టీయా ఎస్పనోలా" అనే ప్రముఖమైన మందంగానుండే పొరటును తరిగిన బంగాళదుంపలతో కలిపి వండుతారు. దీనిలో చాలాసార్లు ఉల్లిపాయముక్కలు, తక్కువ సార్లు కిలాట తురుము, బుట్టమిరపకాయలు, వండిన తరిగిన పందిమాంసం కలుపుతారు. 
 • జపానులో "తమగొయాకీ" అనబడే సాంప్రదాయపు పొరటును గ్రుడ్లు, సోయా సాస్, బొనీతో ముక్కలు (ఒక రకం జంతికలు వంటివి), పంచదార, నీరు కలిపి చతురస్రాకారపు పెనంలో వండుతారు. పొరలు పొరలుగా గ్రుడ్డు మిశ్రమాన్ని పోస్తూ మధ్యమధ్య పొరలలో చీస్ తురుము వేస్తూ దీనిని తయారుచేసి పుల్లలతో తింటారు. జాపనీయులు "ఒమురెత్సు" అనే మరొక రకం పొరటును అన్నంతో, టమాటా సాస్తో తింటారు. 
 • థాయి వంటకాల్లో, "ఖాయ్ చియావ్" అనబడే సాంప్రదాయపు పొరటును  గిలకగొట్టిన గ్రుడ్లు, చేపసాస్, కలిపి ఒక బాణలిలో లోవేపుడు (డీప్ ఫ్రై) చేసి ఆవిరికుడుములతో, కొత్తిమీర జల్లి తింటారు. దీనిలోని మరొక రకం పేరు"ఖాయ్ చియావ్ సోంగ్ ఖ్రుయాంగ్". దానిని పెనంపై వేపిన మాంసం, కాయగూరలతో కలిపి తింటారు. ఇంకో రకం థాయి పొరటు "ఖాయ్ యట్ సాయ్" అనేదానిలో గ్రుడ్లను ఉడికించి లోపల పసుపు తీసివేసి మాంసం లేదా కూరగాయలను నింపి తింటారు.
 • పార్సీయ వంటలలో, పొరటును "పోరా" అంటారు. దానిలో గ్రుడ్లు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఆకులు కలిసివుంటాయి. సాధారణంగా దానిని భారతీయ లేదా ఇరానీ తేనీటిటో, గోధుమ రొట్టెలతో ఉదయం అల్పాహారంగా తీసుకుంటారు.

ఇవి కూడా చూడు[మార్చు]

References[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పొరటు&oldid=3552387" నుండి వెలికితీశారు