Jump to content

పొలాల పండుగ

వికీపీడియా నుండి

పొలాల పండుగ (Eng: Pola Festival, हिंदी: पोला त्योहार ) పొలాల అమావాస్య శ్రావణ మాసం ముగింపు వారాల్లో అమావాస్య రోజున జరుపుకునే పండుగ కాబట్టి పొలాల అమావాస్యను పొలాల పండుగ, లేదా ఎడ్ల పండుగ పేరుతో ఘనంగా జరుపుకుంటారు.[1]. ఈ పండుగను తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్,కరీంనగర్,నిజామాబాద్ జిల్లా తో పాటు మహారాష్ట్రమధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో రైతులు ఈ ఎడ్ల పండుగను ప్రత్యేకంగా చేయడం అనవాయితి.[2][3].

పొలాల పండుగ
పొలాల పండుగ
పొలాల అమావాస్య రోజున ఎడ్లను అంజనేయ స్వామి దేవాలయం చుట్టు( ప్రదక్షిణాలు )తిప్పుతారు
అధికారిక పేరుపొలాల అమావాస్య
యితర పేర్లుఎడ్ల పండుగ
జరుపుకొనేవారుతెలంగాణా ప్రజలు
ప్రారంభంశ్రావణ మాసం ముగింపు వారాల్లో
ఉత్సవాలుపొలాల అమావాస్య రోజు జరుపుతారు
ఆవృత్తిసంవత్సరానికి ఒకసారి

పండుగ విశేషాలు

[మార్చు]
అంగట్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్న పశువుల ఆభరణాలు

వ్యవసాయ పనుల్లో నిరంతరంగా రైతన్నల కోసం కష్టపడే బసవన్న రుణం తీర్చుకోవడం కోసమే వ్యవసాయదారులు ఈ పొలాల అమావాస్యను ఎడ్లపండుగ పేరుతో ఘనంగా జరుపుకుంటారు. దాదాపు పొలం లోని ఖరీఫ్ సీజన్ పనులు పూర్తి కావడంతో ఒక రోజు ముందు సాయంత్రం సమయంలో ఎద్దుల కాళ్లు కడిగి, మొఖం మీద నీళ్ళు చల్లి ఎద్దు నుదుటి పైన కుంకుమ, పసుపులతో బోట్టు పెట్టి ఎద్దుల మెడ, మూపురం పైన పసుపుతో కలిపి నూనె, డబ్బగడ్డితో రాస్తూ బరువు దించుతూ మరాఠీ భాషలో ఇలా అంటారు. చాంగోలి చాంగ్భలా "లాల్మా" బైలాచా ఖాంద్ బల్లా (వుత్ర్రా)హరభోలా హరహర మహాదేవ్‌, అజ్ అవతాన్ ఉద్యా జేవాలయలా య్యా బసవన్నలకు ఆహ్వానం పలుకుతారు. రేపు తినడానికి రండి అని చెప్పి ఎడ్ల నుదుటకు బిల్వ పత్రం, మోదుగ నారతో కొమ్ముకు కట్టి నైవేద్యం ఇచ్చి మొక్కుకుంటారు. దీనినే బరువు దించడం అంటారు.

అమావాస్య రోజు

[మార్చు]

పండుగ రోజు ప్రోద్ధున్నే ప్రతి ఒక్కరు వారి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు మోదుగ కొమ్ములతో అలంకరిస్తారు. మళ్ళీ ప్రొద్దున ఎడ్లను మేపడాని తీసికేళ్ళి చెరువులో ఎడ్లను శుభ్రంగా కడుగుతారు. కొమ్ములకు వార్నిస్ రంగులు,రంగు కాగితాలు బెగడ్ వేసి మెడలో గంటలు, కాళ్లకు గజ్జెలు కట్టి, ఒంటిపై జూళ్లులతో కప్పి ముక్కుకు కొత్త దారంతో తయారు చేసిన రంగుల ముక్కుతాడు,మోర్కే, పగ్గంతో కట్టి అందంగా అలంకరిస్తారు. ఆ రోజు ఉపవాసం ఉండి మహిళలు ఎడ్లకు ప్రసాదం బూరెలు తయారు చేసి సాయంత్రం అమావాస్య దాటక ముందే హరబోలా హర హర మహదేవ అనే నినాదంతో డప్పు వాయిద్యాలతో ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్ళి అగర్బత్తులు ముట్టించి, కొబ్బరి కాయలు కోట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏడు మంగళాష్టకం పాడి అక్షింతలు చల్లి ఊరేగింపులుగా ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ తిప్పుతారు. అచటి నుండి ఎవరి ఎద్దుల్ని వాళ్లు తమఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటి యజమాని, ఆడపడుచులు మంగళ హారతి ఇచ్చి ఎద్దుల కాళ్లు కడిగి మొఖం మీద నీళ్ళు చల్లి కుంకుమతో బోట్టు పెట్టి పూజలు చేసి బూరెలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు.పూజ ముగిసినంతరం వాటి కాళ్లకు నమస్కారించి డబ్బులతో దిష్టి తీసి ఆ డబ్బును పొలం పని చేసె జీతగాళ్ళకు కానుకగా ఇచ్చి, కొత్త బట్టలు, బహుమతులు అందజేసి జేస్తారు.తండాలో ప్రతి ఇంటికి వెళ్ళి మొక్కి ఆ తర్వాత ఇంటి పెద్దయ్యకు మొక్కి ఆశీర్వాదం తీసుకుని అందరూ భోజనాలు చేస్తారు. ఇంతటి తో పండుగ ముగుస్తుంది[4][5].

రెండో రోజు భోడ్గా

[మార్చు]

పొలాల పండుగ రెండో రోజున భోడ్గా,భడ్గా,లేదా భోడ్గ్యా పండుగను ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు.భోడ్గా అనగా కల్లు తాగి మటన్ తీనే పండుగ అని అర్థం. ప్రొద్దున్నే ఐదు గంటల సమయంలో ఊరి నుంచి ఈగలు దోమలు, జ్వరాలు వెళ్ళి పోవాలని గుమ్మాలకు అలంకారించిన మోదుగ కొమ్మలను పట్టుకోని ప్రోధ్ధనే ఇంట్లో, వాకిట్లో దోమలను ఈగలను బయటికి తరుముకుంటూ మాకి మాచ్చర్ లేజోరే భడ్గ్యా అని ఐదు సార్లు అనుకుంటూ వాటిని బయటికి తరమెస్తారు. అదే రోజు తండా ప్రజలు నాయక్ ఆధ్వర్యంలో మేక పోతు కోసి పోగులు వేసి అందరికీ పంచి ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ కల్లుతాగి, మటన్ కూరతో భోజనం చేసి జరుపుకుంటారు.

మూలాలు

[మార్చు]
  1. Desam, A. B. P. (2022-08-28). "పొలాల పండుగ అంటే ఏంటి? అందులో 'పురన్ పోలీ' రెసిపీ ఎందుకంత ప్రత్యేకం?". telugu.abplive.com. Retrieved 2024-08-25.
  2. telugu, NT News (2023-09-13). "పల్లెల్లో ప్రకృతి పండుగ". www.ntnews.com. Retrieved 2024-08-25.
  3. "కాడెద్దుల పండుగ.. కనుల విందుగ.. | Polala Amavasya 2021: Celebrated in Adilabad District | Sakshi". www.sakshi.com. Retrieved 2024-08-25.
  4. telugu, NT News (2023-09-15). "వైభవంగా పొలాల పండుగ". www.ntnews.com. Retrieved 2024-08-25.
  5. Kalyani (2023-09-14). "కన్నుల పండువుగా కాడెద్దుల పొలాల పండుగ". www.dishadaily.com. Retrieved 2024-08-25.