Jump to content

పోచర్

వికీపీడియా నుండి
పోచర్
జానర్క్రైమ్ డ్రామా
సృష్టికర్తరిచీ మెహతా
రచయిత
  • రిచీ మెహతా
  • గోపన్ చిదంబరన్
దర్శకత్వంరిచీ మెహతా
తారాగణం
దేశంభారతదేశం
అసలు భాషమలయాళం
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ producers
  • ఆలియా భట్
  • ప్రేరణ సింగ్
  • ఎడ్వర్డ్ హెచ్.హామ్ జూనియర్
  • రేమండ్ మాన్స్ఫీల్డ్
ఛాయాగ్రహణంజోహన్ హ్యూర్లిన్ ఎయిడ్ట్
ఎడిటర్లు
  • బెవర్లీ మిల్స్
  • సుసాన్ షిప్టన్
  • జస్టిన్ లి
ప్రొడక్షన్ కంపెనీలు
  • క్యూ.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • సూట్ఏబుల్ పిక్చర్స్
  • పూర్ మ్యాన్స్ ప్రొడక్షన్స్
  • ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్అమెజాన్ ప్రైమ్ వీడియో
వాస్తవ విడుదల23 ఫిబ్రవరి 2024 (2024-02-23)

పోచర్‌ 2024లో మలయాళం భాషలో విడుదలైన క్రైమ్ డ్రామా టెలివిజన్ మినిసిరీస్. 2015లో కేరళ అటవీశాఖ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్‌ శిఖర్‌’ ఆధారంగా ఈ సిరీస్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, క్యూ.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్, సూట్ఏబుల్ పిక్చర్స్, పూర్ మ్యాన్స్ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆలియా భట్[1], ప్రేరణ సింగ్, ఎడ్వర్డ్ హెచ్. హామ్ జూనియర్, రేమండ్ మాన్స్ఫీల్డ్ నిర్మించిన ఈ సిరీస్‌కు రిచీ మెహతా దర్శకత్వం వహించాడు.

నిమిషా సజయన్, రోషన్‌ మాధ్యూ, దిబ్యేందు భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 15న విడుదల చేసి[2], సిరీస్‌ను 2024 ఫిబ్రవరి 23న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో విడుదలైంది.

ఏనుగులను అంతమొందిస్తున్న స్మగ్లర్లకు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ కిందిస్థాయి అధికారి కూడా సాయం చేస్తుంటాడు. జరుగుతున్న దారుణాలు చూడలేక అప్రూవర్‌గా మారతాడు. స్మగ్లర్‌ రాజ్‌ (నూరుద్దీన్‌) ఆధ్వర్యంలోనే ఏనుగుల వేట కొనసాగుతుందని ఆ అధికారి పై అధికారులకు చెబుతాడు. దీంతో డిపార్ట్‌మెంట్‌ మొత్తం అలర్ట్‌ అవుతుంది. స్మగ్లర్లను పట్టుకోవడానికి రేంజ్‌ ఆఫీసర్‌ మాలా జోగి (నిమిషా సజయన్‌) నేతృత్వంలో ఒక బృందం రంగంలోకి దిగుతుంది. అలాన్‌ (రోషన్‌ మాథ్యూ)తోపాటు మరికొందరితో కలిసి రాజ్‌ను పట్టుకోవడానికి అడవి అంతా గాలిస్తుంటుంది. ఈ ఆపరేషన్‌లో మాల ఏనుగుల వేటగాళ్లను పట్టుకుందా? ఈ క్రమంలో వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరికి ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]
  • నిమిషా సజయన్ - మాలా
  • రోషన్ మాథ్యూ - అలాన్ జోసెఫ్‌
  • దిబ్యేందు భట్టాచార్య - నీల్ బెనర్జీ
  • కని కుశృతి - DFO దిన
  • అంకిత్ మాధవ్ - విజయ్ బాబు
  • రంజితా మీనన్ - అచల జోసెఫ్‌, అలాన్ భార్య
  • మాలా పార్వతి - రోష్ణ , మాలా తల్లి
  • డెంజిల్ స్మిత్ - నీలేష్ శర్మ, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్
  • వినోద్ షరావత్ - కిషోర్ కుమార్
  • హన్నా రెజీ కోషి - అభిలాష
  • నూరుద్దీన్ అలీ అహ్మద్ - రాజ్‌
  • జింజ్ షాన్ - యదు
  • సూరజ్ పాప్ - అరుకు
  • ప్రవీణ్ టీజే - పొయ్య
  • అమల్ రాజ్‌దేవ్ - మోరిస్ ఫిన్‌

మూలాలు

[మార్చు]
  1. Prajasakti (7 February 2024). "'పోచర్‌'కు నిర్మాతగా ఆలియాభట్‌". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  2. A. B. P. Desam (15 February 2024). "'పోచర్' ట్రైలర్ - ఇండియాలో జరిగిన అతిపెద్ద క్రైమ్ కథ ఇది". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  3. The Hindu (24 February 2024). "'Poacher' series review: Sharp, sobering thriller on India's ivory trade" (in Indian English). Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పోచర్&oldid=4154859" నుండి వెలికితీశారు