పోచా బ్రహ్మానంద రెడ్డి
పోచా బ్రహ్మానందరెడ్డి | |||
| |||
పార్లమెంట్ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం | ||
---|---|---|---|
ముందు | ఎస్.పి.వై.రెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 01 జనవరి 1954 ఉయ్యాలవాడ (గ్రా, మం), కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | వెంకట రెడ్డి, ఈశ్వరమ్మ | ||
జీవిత భాగస్వామి | రామపుల్లమ్మ | ||
సంతానం | మీనాక్షి, దేవమ్మ, వాణెమ్మ, జనార్దన్ రెడ్డి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
పోచా బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]పోచా బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా; ఉయ్యాలవాడలో 1954 జనవరి 01లో వెంకట రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కాన్పూర్ యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) పూర్తి చేసి కొంతకాలం అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్‌గా పనిచేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]పోచా బ్రహ్మానంద రెడ్డి నంద్యాలలో 1985లో భారతీ సీడ్స్ స్థాపించి, నంది రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడిగా రైతు సమస్యలపై పోరాటాలు చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004లో ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడిగా పనిచేశాడు. బ్రహ్మానంద రెడ్డి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం 2017లో బీజేపీలో చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాడు. ఆయన 2019లో బీజేపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరాడు.[2] పోచా బ్రహ్మానంద రెడ్డి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానంద రెడ్డి పై 2,50,119 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2019). "Members : Lok Sabha". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
- ↑ Sakshi (9 March 2019). "వైఎస్సార్‌సీపీలోకి చల్లా, పోచా". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
- ↑ Sakshi (2019). "AP Lok Sabha Election Results 2019 | Andhra Pradesh MP Election Results and Winners List". Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.