పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాసన సభ సభ్యుడు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2014
ముందు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి
నియోజకవర్గము నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1980-03-23) 1980 మార్చి 23 (వయస్సు: 39  సంవత్సరాలు)
నెల్లూరు జిల్లా
రాజకీయ పార్టీ YSR కాంగ్రెస్
జీవిత భాగస్వామి జాగృతి
సంతానము పాప సమన్వి , బాబు ధర్మనందన్‌
నివాసము నెల్లూరు జిల్లా

పోలుబోయిన అనిల్ కుమార్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకులు. నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం నుండి 2014లో శాసనసభ్యునిగా ఎన్నికైనాడు[1].

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1980 మార్చి 23న పోలుబోయిన తిరుపతయ్య, శైలమ్మ దంపతులకు జన్మించాడు. అతని బాబాయి సుధాకర్‌ మృతితో రాజకీయాల్లోకి వచ్చాడు. 2008లో అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేసిన అతను వెనుదిరిగి చూడలేదు. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌గా తన ప్రస్తానం ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న దశలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించడంతో జగన్‌తోపాటే వైసీపీలో చేరాడు. 2014లో ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం నుండి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు. వై.ఎస్. జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో నీటివనరుల శాఖా మంత్రిగా భాద్యతలను 2019 జూన్ 8 నుండి చేపట్టాడు.[2][3][4]

మూలాలు[మార్చు]

  1. "పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్". 2019-01-24. Cite web requires |website= (help)
  2. "Andhra Pradesh Assembly election result: Full list of winners". financialexpress.
  3. "Following in the footsteps of his father". The Hindu.
  4. "Goutham, Anil to secure place in Cabinet". Hansindia.

బయటి లంకెలు[మార్చు]