ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి
ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి


ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
తరువాత అనిల్ కుమార్ యాదవ్
నియోజకవర్గం నెల్లూరు పట్టణ

వ్యక్తిగత వివరాలు

జననం 1952
నెల్లూరు, నెల్లూరు జిల్లా
మరణం 2022 జనవరి 31
నెల్లూరు, నెల్లూరు జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు వెంకటశేషా రెడ్డి
నివాసం నెల్లూరు

ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పని చేసి ఆ తరువాత నెల్లూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, నెల్లూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన ఆ తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌పై 90 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి 2014 ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ చేతిలో ఓడిపోయాడు.

మరణం

[మార్చు]

శ్రీధర్ కృష్ణారెడ్డి క్యాన్సర్‌తో బాధపడుతూ నెల్లూరులోని తన నివాసంలో 2022 జనవరి 31న మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (19 May 2009). "Chiru elected PRLP leader, party to play constructive role". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
  2. The New Indian Express (21 August 2023). "Nellore City set to witness a tough contest" (in ఇంగ్లీష్). Retrieved 7 May 2024.
  3. 10TV Telugu (31 January 2022). "నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూత" (in Telugu). Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)