Jump to content

పోస్టుకార్డు

వికీపీడియా నుండి
భారత తంతితపాలా వారి పోస్టుకార్డు, చిరునామా విభాగాన్ని కూడా చూడవచ్చు

పోస్టుకార్డు, అనునది ఇతరులకు సమాచారం చేరవేసే ఒక రకమైన సాధనం లాంటి ఉత్తరం. పోస్టు కార్డు ను ఈ విధంగా నిర్వచించారు "ఒక కవరు లేకుండా పంపే సమాచార సందేశాన్ని రాయగల కార్డు", దీనికి పంపిన వ్యక్తి ఒక స్టాంప్ అతికించాలి[1].

ఆవిష్కరణ

[మార్చు]
1891 సంవత్సరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ బ్రిటిష్ ఇండియా పోస్ట్ కార్డ్ ను నీలం రంగు ఒకటిన్నర అన్నా క్వీన్ విక్టోరియా స్టాంప్ తో జాంజిబార్ లో ఉపయోగించారు.

పోస్టు కార్డు ఆవిష్కరణలో ఆస్ట్రియా-హంగరీలో, డాక్టర్ ఇమ్మాన్యుయేల్ హెర్మాన్ (ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్) న్యూ ఫ్రీ ప్రెస్ లో ఒక వ్యాసం రాశాడు, ఇందులో ఒక లేఖ రాయడానికి అవసరమైన సమయం, శ్రమ, పంపిన సందేశం పరిమాణానికి అనుగుణంగా లేదని ఎత్తిచూపాడు. మరింత తక్కువ, సమర్థవంతమైన సమాచారం అందచేయడం ( కమ్యూనికేషన్ల) కోసం ఆచరణాత్మక, తక్కువ ఖరీదుతో చౌకైనపద్ధతిని అమలు చేయాలని ఆయన సూచించాడు. అతని సూచన, సిఫార్సులు ఆస్ట్రియన్ పోస్ట్ (తపాలా శాఖ) ను ఆకట్టుకున్నాయి, వారు అక్టోబరు 1, 1869 న వాటిని ఆచరణలోపెట్టారు, దీని ఫలితంగా ముందు చిరునామాకు స్థలంతో కూడిన లేత గోధుమ రంగు 8.5x12 సెం.మీ దీర్ఘచతురస్రాకారం, వెనుక భాగంలో సంక్షిప్త సందేశానికి చోటు లభించింది. పోస్ట్ కార్డ్ పై కుడి మూలలో ముద్రించిన 2 క్రూజర్ స్టాంప్ ఉంది, దీనికి సాధారణ అక్షరం ధరలో సగం ఖర్చు అవుతుంది. పోస్ట్ కార్డ్ 2019 సంవత్సరం లో జరిగిన 150 వ వార్షికోత్సవంలో విజయవంతమైన వేడుక తరువాత, ప్రతి సంవత్సరం అక్టోబరు 1 న ప్రపంచ పోస్టు కార్డు దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు[2].

పోస్టుకార్డు వినియోగం

[మార్చు]

ఇది దీర్ఘచతురస్రాకారములో మందపాటి అట్టతో చేయబడి ఉంటుంది. దీనిని ఉత్తర ప్రత్ర్యుత్తరంగా ఉపయోగిస్తారు. దీనిపై సమాచారం వ్రాసి, చిరునామ రాసి తపాలా పెట్టెలో వేస్తే అది ఆ చిరునామాకు చేరుతుంది.గతంలో సమాచార మార్పిడికి, క్షేమ సమాచారము తెలుసుకునేందుకు పోస్టు కార్డే (ఉత్తరము) ప్రధాన ఆధారము.పేదల నుండి ధనికుల వరకు ఎక్కువగా దీనిపైనే ఆధారపడేవారు . కాలగమనంలో వచ్చిన మార్పులు దీనిపై మెనుపర్భావము చూపాయి . ప్రస్తుతము పొస్టుకార్దు మనుగడకోసం పొరాడుతోంది . సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక దీని అవసరము తగ్గిపోయినది . ఇ-మెయిల్స్ చాలావరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోసిస్తున్నాయి . కొన్ని ప్రదే్శములలో మాత్రం ఇప్పటికీ పోస్టుకార్డునే వినియోగిస్తున్నారు.

సుమారు పదిహేనేళ్ళ కిందట వరకు పొస్టుకార్డుకు జనజీవనముతో విడదీయలేని సంబంధము ఉండేది. పొట్టకూటికి వలస వెళ్ళిన కొడుకు క్షేమ సమాచారము కోసం తల్లి, భర్త కోసము భార్య, కుటుంబసభ్యులు అక్కడనుండి ఉత్తరం ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూసేవారు. బంధువుల మధ్య క్షేమసమాచారము ఉత్తరం ద్వారానే తెలుపునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనుమరుగైనది. కొన్ని వ్యాపార సంస్థలు మాత్రము వారి వ్యాపార లావదేవీలు, బకాయిల చెల్లింపుల సమాచారము తెలుపుకుంటున్నారు .

భారతదేశంలో పోస్టుకార్డు

[మార్చు]

మనదేశంలో 1879 జూలై 1 న పోస్టుకార్డును ప్రవేశపెట్టారు. దాదాపు శతాబ్దంపాటు దీనికి ప్రత్యుమ్నాయం లేకుండా పోవడంతో ప్రజలు దీనిని ప్రధాన సమాచార వారధిగా ఉపయోగించారు. ప్రజలు తమ క్షేమ సమాచారాలను పోస్టుకార్డు ద్వారానే చెప్పుకునేవారు. దీని వెలకూడా అతి తక్కువగా ఉండి అందరికీ అందుబాటులో ఉండేది. దీనిపై వ్రాసిన సమాచారాన్ని కప్పిపెట్టే అవకాశం లేకపోవడంతో అది అందరికీ కనిపిస్తూ ఉండేది. పల్లెలలో నిరక్షరాస్యులు పోస్టుమ్యాన్ ద్వారా కార్డులను చదివించుకునేవారు. చదివిన తర్వాత కూడా దీనిని అపురూపంగా దాచుకుని మరలా మరలా చదువుకునేవారు .చరవాణి రాకవలన ఈరోజు దీని వాడకం పడిపోయి దాదాపు అవసానదశకు చేరుకుంది.

పోస్టు కార్డు జూలై 1879 లో భారతదేశంలో ఒక త్రైమాసికం కోసం ప్రవేశపెట్టబడింది, తర్వాత 1883 నాటికి దేశంలో 26 మిలియన్ల కార్డుల వార్షిక అమ్మకాలను నమోదు చేసిందని పిక్చరెస్క్యూ ఇండియా : ఎ జర్నీ ఇన్ ఎర్లీ పిక్చర్ పోస్ట్ కార్డ్స్ (1896 - 1947) ( Picturesque India: A Journey in Early Picture Postcards (1896 - 1947) లో పేర్కొన్నారు[3].

భారతదేశంలో పోస్ట్ కార్డ్ రెండు రకాలుగా లభిస్తుంది: సింగిల్ & రిప్లై పోస్ట్ కార్డ్. పోస్ట్ కార్డ్ లు భారతదేశంలో మాత్రమే ప్రసారం కోసం ఉపయోగించబడతాయి. వీటి కొలతలు 14 సెం.మీ (పొడవు) × 9 సెం.మీ వెడల్పు). లో ఉంటాయి[4].

చరిత్ర

[మార్చు]

అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలో 1861 లో తొలిసారిగా పోస్టుకార్డును ప్రవేశపెట్టినారు. తరువాత మిగిలిన దేశాలలో వాడుకలోనికి వచ్చినది. మన దేశములో 1879 జూలై ఒకటిన (01/07/1879) ప్రవేశపెట్టి వినియోగం లోనికి వచ్చినది .

1870 లో సృష్టించబడిన పోస్టుకార్డు చౌకైన, సమాచారం అందించే సాధనంగా ప్రజాదరణ పొందింది. పోస్టుకార్డుల ఆవిష్కరణ, సమాచారము ఎవరైనా ఏ విధము గా ఉత్తరాల నమూనా లేకుండా  తొందరగా, చౌకైన ఉత్తరప్రత్యుత్తరాలను జరుపవచ్చును. 20 వ శతాబ్దం ప్రారంభం నుండి మొదటి ప్రపంచ యుద్ధం వరకు పోస్టుకార్డులు ప్రజలు వాడకం స్థాయిని పెంచింది. ప్రస్తుత సాంకేతిక యుగంలో డిజిటల్ కమ్యూనికేషన్ కొత్త రూపాలతో రావడం ప్రజల నుంచి ఎక్కువగా కనుమరుగవుతున్నాయి.

మొదటి మొదటి పోస్టుకార్డులు 1869 లో ఆస్ట్రియా-హంగరీ లో రావడం జరిగింది. బ్రిటిష్ లో పోస్ట్ కార్డ్ 1870 సంవత్సరం రెండు రకాలుగా వచ్చి,  హంగేరియన్ డిజైన్ పై ఎక్కువగా ఆధారపడ్డాయి. బ్రిటీష్ పోస్టాఫీస్ కార్డుల్లో  ముద్రించిన పోస్టు కార్డు ఖరీదు తో  పెన్నీ స్టాంప్,  సందేశం లేదా వ్యాపార ఉత్తరప్రత్యుత్తరాలను మరొక వైపు  రాయడానికి  వీలుగా మాత్రమే ముద్రించబడ్డాయి.1871 లో బ్రిటన్లో సుమారు 75 మిలియన్ల పోస్టుకార్డులు  ప్రజలు వాడటం జరిగింది. 1910 లో కింగ్ ఎడ్వర్డ్ ఏడవ పాలన ముగిసే సమయానికి సంవత్సరానికి పోస్టుకార్డుల వాడకం  800 మిలియన్లకు పైగా  పెరిగాయి. బ్రిటిష్ పరిపాలనలో పోస్ట్ కార్డ్ అభివృద్ధి కాలక్రమేణా బ్రిటిష్ పోస్టుకార్డుల రూపకల్పన మారింది, అంతర్జాతీయ తపాలా కోసం కొత్త కార్డులు జోడించబడ్డాయి. బ్రిటిష్ సామ్రాజ్యం లోపల పంపిన పోస్ట్ కార్డ్ లలో 1885 నుండి హెన్రిచ్ వాన్ ఏంజెలి వేసిన పెయింటింగ్ ఆధారంగా విక్టోరియా రాణి  చిత్రం తో ఉంది. ప్రైవేట్ ప్రచురణకర్తలు  ఫోటో లతో తయారు చేసిన  పోస్ట్కార్డులను 1894 వరకు పోస్టాఫీసు అంగీకరించలేదు[5].

ధరలు

[మార్చు]

ప్రస్తుతం పొస్టుకార్డు ధర 50 పైసలు. ప్రభుత్వ, వ్యాపార సంస్థల ప్రకటనలతో ఉన్న మేఘదూత్ కార్డు వెల 25 పైసలు ఆయా సంస్థలు తపాల శాఖకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే చిరునామా ప్రక్కన ప్రకటనలు ముద్రించి వినియోగదారులకు 25 పైసలకే అమ్ముతారు. స్వాతంత్ర్యం రాకముందు మనదేశములో కాని, అర్ధ అణా, అణా, మూడు పైసలు, ఐదు పైసలు, పది పైసలు, 15 పైసలు, 25 పైసలు ధరలు ఉండేవి . వివిధ చానళ్ళు నిర్వహించే పలు పోటీలకు సంబంధించిన సమాచారము పంపించేందుకు ఉపయోగించే పోస్టుకార్దు ధర మాత్రము 10 రూపాయిలు ఉన్నది . తొలుత ఈ కార్డు 2 రూపాయిలు ఉండేది . ఎస్.ఎం.ఎస్ లు రావదంతో ఈ కార్డులు మూలన పడ్డాయి .

తయారీ ఖర్చు

[మార్చు]

కార్డు తయారీకి ప్రభుత్వానికి రూ.1.33 ఖర్చు అవుతుంది . ప్రజా సంక్షేమముకోసం ఈ ధరను తగ్గించి నస్టాలను భరించి అమ్ముతుంది .

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]
  1. "Definition of POSTCARD". www.merriam-webster.com (in ఇంగ్లీష్). 2024-08-29. Retrieved 2024-09-03.
  2. postcrossing.com. "History of the postcard". worldpostcardday.com (in ఇంగ్లీష్). Retrieved 2024-09-03.
  3. Desk, India TV News; News, India TV (2019-07-01). "Book traces history of picture postcards in India". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2024-09-03. {{cite web}}: |last2= has generic name (help)
  4. "Post Card". www.indiapost.gov.in. Retrieved 2024-09-03.
  5. "Postcards". https://www.postalmuseum.org/. 03 September 2024. Retrieved 03 September 2024. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help); External link in |website= (help)