Jump to content

ప్రకాష్ కొఠారి

వికీపీడియా నుండి
ప్రకాశ్ నానాలాల్ కొఠారీ
జననం
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తివైద్యుడు, సెక్సాలజిస్టు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సెక్సాలజిస్టు
పురస్కారాలుపద్మశ్రీ
వాస్ మ్యాన్ ఆఫ్ ద యియర్

ప్రకాశ్ నానాలాల్ కొఠారీ భారతదేశంలోని సెక్స్ స్పెషలిస్టు. అతను కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్, ముంబైలోని సేథ్ గోర్దాండాస్ సుందర్‌దాస్ మెడికల్ కాలేజీలో లైంగిక వైద్యా విభాగం అధిపతి.[1][2][3] ముంబై విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్[2] అయిన కొఠారికి లైంగిక శాస్త్రానికి సంబంధించిన అనేక పుస్తకాలు , వ్యాసాలు రాసాడు[1]. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ సెక్సాలజీ (WAS) 1989 లో అతన్ని మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీకి నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారంతో సత్కరించింది.[4] అతనికి ఆసియన్ ఫెడరేషన్ ఆఫ్ సెక్సాలజీ "ది సెక్సాలజిస్టు ఆఫ్ ఆసియా" గా గౌరవించింది. సెక్సాలజీలో అతను చేసిన విశేష కృషికి గానూ వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ సెక్సాలజీ (WAS) 1997లో "ద వాస్ గోల్డ్ మెడల్" అందజేసింది.[5]

అతను మెడికల్ గ్రాడ్యుయేషన్ చేసాడు. 1981లో పి.హెచ్.డి చేసాడు. అతను "ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేటర్స్, కౌన్సిలర్స్, థెరపిస్ట్స్" కు వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను 1985లో జరిగిన 7వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ సెక్సాలజీ సభలకు, 1981లో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆర్గాస్మ్ లకు అద్యక్షత వహించాడు. అతను "ఆర్గాస్మ్:న్యూ డైమన్షన్స్" అనే పరిశోధనా పత్రాన్ని వెలువరించాడు. అతను స్కాండినేవియా దేశంలోని "స్కాండినేవియన్ జర్నల్ ఆఫ్ సెక్సాలజీ" పత్రికలో కౌన్సిలింగ్ ఎడిటర్ గా ఉన్నాడు. అతను యు.కె లోని "బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సెక్సువల్ అండ్ రిలేషన్ షిప్ థెరపీ" కి సలహాదారుడు. అతని వాస్తవ పరిశోధనలు "స్కలనం" పై చేసాడు. అతను వాత్సాయన కామసూత్రాలపై కూడా పరిశోధనలు చేసాడు.[5]

అతని కుమార్తె డా. రచనా కొఠారితో కలిసి కొంతకాలంగా స్వాతి సచిత్రవారపత్రికలో "సెక్స్ అండ్ సైకాలజీ" అనే శీర్షికలో పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.

పద్మశ్రీపురస్కారం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Palanpur Online". Palanpur Online. 2014. Archived from the original on 15 జూలై 2014. Retrieved 20 January 2015.
  2. 2.0 2.1 "American Board of Sexology". American Board of Sexology. 2014. Archived from the original on 3 ఫిబ్రవరి 2015. Retrieved 20 January 2015.
  3. "OPD (Sexology) Dr. Prakash Kothari". YouTube video. MI Marathi News. 17 July 2014. Retrieved 20 January 2015.
  4. "Padma Awards" (PDF). Padma Awards. 2014. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 11 November 2014.
  5. 5.0 5.1 Kothari, Prakash (2009-01-01). Sex & You (in ఇంగ్లీష్). Rajkamal Prakashan. ISBN 978-81-267-0925-0.

బాహ్య లంకెలు

[మార్చు]