ప్రతాప్ భాను మెహతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతాప్ భాను మెహతా
2009 ఇండియా ఎకనామిక్ సమిట్‌లో మాట్లాడుతున్న మెహతా
2009 ఇండియా ఎకనామిక్ సమిట్‌లో మాట్లాడుతున్న మెహతా
జననం 1967 (age 56–57)
జోధ్‌పూర్, రాజస్థాన్
నివాసంభారతదేశం
జాతీయతభారతీయుడు
రంగమురాజకీయ శాస్త్రం
సంస్థలుసెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్
మాతృ సంస్థసెంట్ జాన్స్ కాలేజి, ఆక్స్‌ఫర్డ్
ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ

ప్రతాప్ భాను మెహతా (జననం 1967) ఒక భారతీయ విద్యావేత్త. అతను న్యూ ఢిల్లీ లోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు అధ్యక్షుడిగా పనిచేశాడు [1] 2017 జూలై నుండి 2019 జూలై వరకు అశోక విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలరుగా పనిచేసాడు. [2]

జీవిత విశేషాలు[మార్చు]

ప్రతాప్, జోధ్‌పూర్‌లో రాజస్థానీ జైన కుటుంబంలో జన్మించాడు. [3] అతని ప్రారంభ పాఠశాల విద్య సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ పాఠశాల లోను, జైపూర్ లోని సెయింట్ జేవియర్స్ లోనూ జరిగింది. [4] మెహతా ఆక్స్‌ఫర్డ్ లోని సెయింట్ జాన్స్ కాలేజీ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (పిపిఇ) లో బిఎ, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుండి పాలిటిక్స్ లో పిహెచ్. డి పొందాడు.  

కెరీర్[మార్చు]

మెహతా అనేక బోధనా పదవులను నిర్వహించాడు. అతను NYU స్కూల్ ఆఫ్ లాలో ప్రొఫెసర్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ విజిటింగ్ ప్రొఫెసర్, హార్వర్డ్‌లోని ప్రభుత్వ, సామాజిక అధ్యయనాల అసోసియేట్ ప్రొఫెసర్, కొంతకాలం పాటు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ, లా అండ్ గవర్నెన్స్ ప్రొఫెసరుగా పనిచేసాడు. [5] అతను భారత ప్రధాన మంత్రికి చెందిన జాతీయ విజ్ఞాన కమిషనులో సభ్యుడు. భారత విశ్వవిద్యాలయాలలో ఎన్నికలపై సుప్రీంకోర్టు నియమించిన లింగ్డో కమిటీలో సభ్యుదు. ప్రముఖ భారత ప్రభుత్వ, అంతర్జాతీయ ఏజెన్సీలకు అనేక నివేదికలు తయారు చెయ్యడంలో దోహదపడ్డాడు. అంతర్జాతీయ అభివృద్ధి పరిశోధన కేంద్రం గవర్నర్స్ బోర్డులో ఉన్నాడు. గ్లోబల్ గవర్నెన్స్ పై వరల్డ్ ఎకనామిక్ ఫోరం కౌన్సిల్ వైస్ చైర్మనుగా ఉన్నాడు. అతను NIPFP, NCAER, NIID బోర్డులో కూడా పనిచేశాడు. అతను అమెరికన్ పొలిటికల్ సైన్స్ రివ్యూ, జర్నల్ ఆఫ్ డెమోక్రసీ వంటి జర్నల్స్ ఎడిటోరియల్ బోర్డులో ఉన్నాడు. [6] అతను 2010 మాల్కం ఆదిశేషయ్య అవార్డును,[7] సాంఘిక శాస్త్రాలకు ఇచ్చే 2011 ఇన్ఫోసిస్ బహుమతినీ (పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్) అందుకున్నాడు. [8]

రాజకీయ సిద్ధాంతం, మేధో చరిత్ర, రాజ్యాంగ చట్టం, [9] భారతదేశంలో రాజకీయాలూ సమాజం, అంతర్జాతీయ రాజకీయ రంగాలలో మెహతా విస్తృతంగా ప్రచురించారు. [10] అతని పాండితీ వ్యాసాలు ఈ రంగంలో ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లోను, అలాగే అనేక సంపుటాలలోనూ వచ్చాయి. అతని ప్రారంభ రచన పద్దెనిమిదవ శతాబ్దపు ఆలోచనల గురించి -ముఖ్యంగా ఆడమ్ స్మిత్ గురించి, మేకింగ్ ఆఫ్ ది ఎన్‌లైటెన్‌మెంట్ గురించీ. [11] ప్రముఖ జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు మెహతా సంపాదకీయ సలహాదారు. అతని కాలమ్‌లు ఫైనాన్షియల్ టైమ్స్, టెలిగ్రాఫ్, ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్, హిందూతో సహా నేక దినపత్రికలలో వచ్చాయి. అమెరికన్ పొలిటికల్ సైన్స్ రివ్యూ, జర్నల్ ఆఫ్ డెమోక్రసీ, ఇండియా అండ్ గ్లోబల్ అఫైర్స్ సహా అనేక అకడమిక్ పత్రికల ఎడిటోరియల్ బోర్డులలో కూడా ఆయన ఉన్నారు. [12]

వివాదాలు[మార్చు]

యుపిఎ ప్రభుత్వ ఉన్నత విద్యా విధానాలకు నిరసనగా మెహతా 2006 లో జాతీయ విజ్ఞాన కమిషన్‌కు రాజీనామా చేశారు. [13]

రాజకీయంగా సంబంధాలున్న బ్యూరోక్రాట్‌ను డైరెక్టర్‌గా నియమించడాన్ని నిరసిస్తూ మెహతా 2016 లో ప్రతిష్ఠాత్మక నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశాడు. నియామకం చేయడంలో ప్రభుత్వం అకాడెమిక్ పరిగణనలను పక్కనపెట్టడంతో కలిగిన అసౌకర్యాన్ని రాజీనామాకు కారణంగా ఆయన ఉదహరించాడు.

ప్రామాణికమైన వనరుల నుండి మాత్రమే వార్తలు చదవడం ప్రస్తుత అవసరమని మెహతా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా దేశంలోని యువత సమాచారం పొందటానికి, అభిప్రాయాన్ని రూపొందించుకోడానికి కోరా, వికీపీడియా వంటి వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, ప్రత్యేకించి తప్పుడు సమాచారం విస్తరించే సమయంలో ఇది అవసరమని ఆయన భావించాడు. [14]

మూలాలు[మార్చు]

  1. "Swaminathan, Anu Aga among new NAC faces". LiveMint. 1 June 2010.
  2. "Pratap Bhanu Mehta to leave CPR, join Ashoka University as vice chancellor". Live Mint.
  3. "Tyranny of identity by decree". Archived from the original on 2019-04-14. Retrieved 2020-06-27.
  4. "Eastward Bound". Face to Face magazine. 1 February 2012. Retrieved 18 January 2018.
  5. "Lunch with BS: Pratap Bhanu Mehta". 20 January 2013.
  6. "Pratap Bhanu Mehta" (PDF). Archived from the original (PDF) on 2018-09-20. Retrieved 2020-06-27.
  7. ""Politics of social justice at deep impasse"". 23 November 2010.
  8. "Infosys Prize Laureates".
  9. "Small step, no giant leap". Indian Express. 23 August 2017.
  10. "Lingayat leap of faith". Indian Express. 3 October 2017.
  11. "The natural career of the imagination : themes in Adam Smith's moral and political philosophy / Pratap Bhanu Mehta". Princeton University Library Catalog. Retrieved 27 December 2018.
  12. "Scholar Pratap Bhanu Mehta is new Ashoka University V-C". Indian Express. 5 May 2017.
  13. "Dear Prime Minister". 22 May 2006.
  14. "'Political Pressure' Bad for Academics: Pratap Bhanu Mehta's Resignation Letter from NMML". 14 August 2016.