ప్రతాప్ సింహా
ప్రతాప్ సింహ | |||
| |||
లోక్‌సభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 26 మే 2014 | |||
ముందు | అడగూర్ హెచ్.విశ్వనాథ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | మైసూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సకలేష్‌పుర , కర్ణాటక , భారతదేశం | 1976 జూన్ 21||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అర్పిత | ||
సంతానం | 1 |
ప్రతాప్ సింహా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మైసూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరులో లోక్‌సభలో జరిగిన పొగబాంబు ఘటనలో దుండగులు ఆయన కార్యాలయం ఇచ్చిన పాసులతోనే లోక్‌సభలోకి ప్రవేశించిన నేపథ్యంలో వార్తల్లో నిలిచాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ప్రతాప్ సింహ కర్ణాటక రాష్ట్రం, హాసన్ జిల్లా, సకలేష్ పురా గ్రామంలో బీ.ఈ. గోపాల్ గౌడ్, పుష్ప దంపతులకు 1976 జూన్ 21న జన్మించాడు. ఆయన మైసూరు యూనివర్శిటీ నుండి మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తి చేశాడు.
వివాహం
[మార్చు]ప్రతాప్ సింహ 2010లో అర్పితను వివాహమాడాడు. వారికీ ఓ పాప విపంచి ఉంది.
రాజకీయ జీవితం
[మార్చు]ప్రతాప్ సింహ 2014లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మైసూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అడగూర్ హెచ్.విశ్వనాథ్ పై 31608 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సి.హెచ్. విజయ్ శంకర్ పై 138647 ఓట్ల మెజారిటీతో వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (26 December 2023). "పార్లమెంట్ ఘటనపై తొలిసారి స్పందించిన ప్రతాప్ సింహా". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
- ↑ Andhrajyothy (25 December 2023). "దేశద్రోహినా.. దేశభక్తుడినా..? ప్రజలే నిర్ణయిస్తారు: ప్రతాప్ సింహా". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
- ↑ V6 Velugu (13 December 2023). "ఎంపీ ప్రతాప్ సింహా ఎవరు.? నిందితులతో సంబంధం ఏంటి.?". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (14 December 2023). "పార్లమెంటులో చొరబాటుదారులకు పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ఎవరు?". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)