ప్రతిమా పూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతిమా పూరి
జననంసిమ్లా, హిమాచల్ ప్రదేశ్ భారతదేశం
మరణం2007 జూలై 29
జాతీయతభారతీయుడు
వృత్తిదూరదర్శన్ యాంకర్
క్రియాశీలక సంవత్సరాలు1958 – 1970
పిల్లలురాజా పూరి

ప్రతిమా పూరి (మరణం 2007 జులై 29) దూరదర్శన్ ఛానల్ మొదటి న్యూస్ రీడర్ గా ప్రసిద్ధి చెందిన భారతీయ పాత్రికేయురాలు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

ప్రతిమా పూరి హిమాచల్ ప్రదేశ్ రాజధాని గోర్ఖా సిమ్లా లాల్ పానీలో ఒక గూర్ఖా కుటుంబంలో జన్మించింది. ప్రతి మా పూరి ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇంద్రప్రస్థ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి పట్టు భద్రురాలు అయింది.[2]

కెరీర్

[మార్చు]

ప్రతిమా పూరి సిమ్లాలో ఆకాశవాణి కేంద్రంలో పనిచేయడం ద్వారా తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించింది.

1959 సెప్టెంబరు 15న ఆల్ ఇండియా రేడియో మొదటి ప్రసారం ప్రారంభమైనప్పుడు, ప్రతిమ పూరి న్యూఢిల్లీకి మార్చబడింది. 1965లో దూరదర్శన్ ఛానల్ వార్త బులిటెన్ ను ప్రతిమా పూరి న్యూస్ వ్యాఖ్యాతగా మారారు.[3] ప్రతిమా పూరి అంతరిక్షంలోకి వెళ్ళన మొదటి వ్యక్తి యూరి గగారిన్ ను ఇంటర్వ్యూ చేసి ప్రసిద్ధిగాంచింది. వివిధ నటులు రాజకీయ నాయకుల వంటి ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేసింది.[4] ఆమె స్థానంలో సల్మా సుల్తాన్ ఎంపిక చేసిన తరువాత, ప్రతిమా పూరి దూరదర్శన్లో ఔత్సాహిక వ్యాఖ్యాతలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది.[3]

మరణం

[మార్చు]

ప్రతిమా పూరి 2007లో మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. "Doordarshan turns 60: Here is a nostalgic look at the broadcaster's milestones". The Economic Times.
  2. "कॉलेज ऑफ द डे :सबसे पुराने महिला कॉलेज में शुमार आईपी कॉलेज". Amar Ujala.
  3. 3.0 3.1 "This Trailblazing Woman Was India's First Newsreader. Yet Few Indians Know Her Story". The Better India.
  4. "Doordarshan turns 60: The advent of Golden age in Indian television". Indian Express.