ప్రత్యూష
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రత్యూష | |
|---|---|
| జననం | 29 ఆగస్టు 1981 |
| మరణం | 2002 ఫిబ్రవరి 23 (వయసు: 20) |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 1998 – 2002 |
| తల్లి | సరోజినీదేవి [1] |
ప్రత్యూష (1981 ఆగస్టు 29 – 2002 ఫిబ్రవరి 23) ఒక సినీ నటి. ఐదు తెలుగు తెలుగు, పన్నెండు తమిళ సినిమాల్లో నటించింది. రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని మొదలైన సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో నటించింది. ఇంకా అనేక టివి ధారావాహిక కార్యక్రమాల్లో నటించింది.
ఆమె తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కలిసి కోకోకోలాలో విషం కలుపుకుని తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సిద్దార్థ రెడ్డి మాత్రం బతికాడు. ఈ వార్త అన్ని ప్రముఖ దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది.[2]
జీవితం
[మార్చు]ప్రత్యూష నల్గొండ జిల్లా, భువనగిరిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.[3] తండ్రి ఆమె చిన్నప్పుడే మరణించాడు. హోటల్ మేనేజ్మెంట్ చదివింది. మోడల్ గా ఉత్తమ స్మైల్ విభాగంలో అవార్డును పొందింది. 17 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించింది. ఆమె తల్లి సరోజినీ దేవి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె సోదరుడు ప్రణీత్ చంద్ర సినిమాల్లో హీరోగా ప్రయత్నిస్తున్నాడు.
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష |
|---|---|---|---|
| 1998 | రాయుడు | తెలుగు | |
| 1999 | శ్రీరాములయ్య | తెలుగు | |
| 1999 | సముద్రం | చంటి | తెలుగు |
| 2000 | మనునీధి | పూంగొడి | తమిళం |
| 2001 | ఇది ఏమి ఊరురా బాబు | తెలుగు | |
| సూపర్ కుడుంబం | అభిరామి | తమిళం | |
| స్నేహమంటే ఇదేరా | అమృత | తెలుగు | |
| పొన్నాన్న నేరం | తమిళం | ||
| థవసి | నందిని | తమిళం | |
| కాదల్ పూక్కల్ | ఉప్పిలి | తమిళం | |
| 2002 | కలుసుకోవాలని | మాధవి | తెలుగు |
| 2004 | సౌండ్ పార్టీ | నందిని | తమిళం |
మరణం
[మార్చు]ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి హైదరాబాదులో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన తర్వాత ప్రత్యూష సినిమా రంగంలోకి ప్రవేశించింది. సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 న తమ వివాహాన్ని పెద్దలు అంగీకరించడం లేదని తన స్నేహితుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి ప్రత్యూష ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సాయంత్రం 7:30 - 8:00 గంటల మధ్యలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష ఫిబ్రవరి 24 న హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం చావును తప్పించుకున్నాడు. చికిత్స అనంతరం మార్చి 9 న ఆసుపత్రి నుంచి డిస్చార్జి అయ్యాడు. వీరు కూల్ డ్రింకులో ఆర్గానో పాస్ఫేట్ అనే పురుగుల మందును కలుపుకుని తాగారానీ, అందువల్లనే ప్రత్యూష మరణించిందనీ, ఆమెకు ఊపిరి ఆడకుండా చేయడం, లైంగిక దాడి చేయడం లాంటివి మరణానికి కారణాలు కావని ముగ్గురు ప్రభుత్వ వైద్యుల బృందం నిర్ధారించింది.[4]
నిందితుడు సిద్ధార్థ రెడ్డిపై సిబిఐ విచారణ జరిపి సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 309 (ఆత్మహత్యకు ప్రయత్నించడం) కింద కేసు నమోదు చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నిందితుడు సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ళ జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ 2004, ఫిబ్రవరి 23 న తీర్పు ఇచ్చింది. దీనిని సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా శిక్షను రెండేళ్ళకు తగ్గించి జరిమానా 50 వేలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష తల్లి సరోజిని దేవి 2012 లో వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2026 లో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తర్వాత ఫిబ్రవరి 17, 2026న సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని తీర్పునిచ్చింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (7 December 2019). "నా కూతురి కేసులో అసలు తీర్పే రాలేదు". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.
- ↑ Feb 25, TNN /; 2002; Ist, 01:53. "Love-struck actress commits suicide | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-11-20.
{{cite web}}:|last2=has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Actress Prathyusha: 4 ఏళ్లలో 12 సినిమాలు.. కెరీర్ పీక్‌లో 'సూసైడ్': నటి ప్రత్యూష కథ ఇది." EENADU. Retrieved 2026-02-17.
- ↑ "Actress' lover convicted in murder case". Sify.com. Archived from the original on 2012-06-24. Retrieved 2012-08-05.
- ↑ "Actress Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం". EENADU. Retrieved 2026-02-17.