నోము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:


==కొన్ని నోములు==
==కొన్ని నోములు==
{{Div col|cols=3}}
* [[అంగరాగాల కథ]]
* [[అంగరాగాల కథ]]
* [[అక్షయబొండాల కథ]]
* [[అక్షయబొండాల కథ]]
పంక్తి 87: పంక్తి 88:
* [[సూర్యచంద్రుల కథ]]
* [[సూర్యచంద్రుల కథ]]
* [[సూర్యపద్మము కథ]]
* [[సూర్యపద్మము కథ]]
{{Div end}}


==మూలాలు==
==మూలాలు==

06:16, 28 అక్టోబరు 2014 నాటి కూర్పు

నోము అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. దీనినే వ్రతము అని కూడా అందురు. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.

ఆంధ్ర దేశమున స్త్రీలు, పిల్లలు నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు.

మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా కలవు. త్రిలోక సంచారియైన నారదు చెప్పినవి కొన్ని కలవు. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.

ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. ఇతర ప్రయోజనములు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయమే లేచుట, నిత్యకృత్యములు తీర్చుకొనుట, స్నానమాచరించుట, మడి వస్త్రములు ధరించుట, పచన కార్యములు నెరవేర్చుట, భక్తిశ్రద్ధలతో షోడశోపచారములతో దైవము నారాధించుట, దైవ నివేదితమైన ప్రసాదమును అందరికి పంచి తాను స్వీకరించుట..

కొన్ని నోములు

మూలాలు

  • నోములు, డి.హలేఖ్య సప్తగిరి సచిత్ర మాసపత్రిక మే 2008 లో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
"https://te.wikipedia.org/w/index.php?title=నోము&oldid=1315222" నుండి వెలికితీశారు