"స్వైన్‌ఫ్లూ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
* చాలామంది నాకు ఫ్లూ వచ్చింది.. ఇప్పుడు టీకా తీసుకోవాలా? అని అడుగుతుంటారు. ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత ఇంక టీకా అవసరం ఉండదు. అందుకే ఈ టీకాను ఫ్లూ జ్వరాల విజృంభణ కంటే ముందే తీసుకుంటే ఫ్లూ రాదు. సాధారణంగా ఏప్రిల్‌లో టీకా తీసుకుంటే ఏడాది పాటు రక్షణ ఉంటుంది కాబట్టి ఫ్లూ జ్వరాలను సమర్థంగా నివారించుకోవచ్చు.
 
* అలాగే కొందరు నాకు దగ్గు, జలుబు ఉంది, టీకా తీసుకోవాలా? అని అడుగుతుంటారు. కానీ నిజానికి దగ్గు, జలుబు ఉన్నప్పుడు అసలు టీకా తీసుకోకూడదు. ఏ టీకాలైనా సాధారణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే తీసుకోవాలి. అలాగే టీకా తీసుకున్న 4 వారాలకు శరీరంలో వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే 'యాంటీ బోడీలు' తయారవుతాయి. కాబట్టి ఒకవేళ ఈ నాలుగు వారాల్లోపే వైరస్‌ ఒంట్లో ప్రవేశిస్తే టీకా పనిచెయ్యదు. కాబట్టి దీన్ని ముందే తీసుకోవటం మంచిది.
 
* అమెరికా వంటి దేశాల్లో ఈ టీకాను సూపర్‌ మార్కెట్లలో కూడా 'ఫ్లూ షాట్‌' పేరుతో ఇచ్చేస్తుంటారు. దీనివల్ల సమాజంలో ఫ్లూ బెడదను బాగా నివారించే అవకాశం కలుగుతోంది.
 
* టీకాల్లో ఒకరకం... ముక్కులో కొట్టుకునే 'స్ప్రే' వంటిదీ ఉంది. దీన్ని అందరికీ ఇవ్వకూడదు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, గర్భిణులకు, పిల్లలకు ఇవ్వకూడదు. దీనివల్ల వారిలో జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. మిగతావాళ్లు తీసుకోవచ్చు.
===టీకా ఎవరికి అవసరం?===
 
టీకా ఎవరికి అవసరం?
స్వైన్‌ఫ్లూ బెడద వద్దనుకునే సాధారణ ఆరోగ్యవంతులు ఎవరైనా తీసుకోవచ్చు. వీరిలో స్వైన్‌ఫ్లూ వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి వైద్యులు వీరిని కచ్చితంగా తీసుకోమని చెప్పటం లేదు. కానీ.. * ఆరేళ్లలోపు పిల్లలు * 60 సంవత్సరాల పైనున్న వృద్ధులు * గర్భిణులు * అవయవ మార్పిడి చేయించుకున్నవారు * రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు * వైద్య సిబ్బంది ... వీరంతా కచ్చితంగా టీకా తీసుకోవటం మంచిది.
===టీకా మోతాదులేమిటి?===
 
టీకా మోతాదులేమిటి?
ఆర్నెల్ల నుంచి 9 ఏళ్ల వయసు వరకూ పిల్లల్లో 0.25 ఎంఎల్‌ కండలోకి నెల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వాలి. 9 ఏళ్ల పైబడిన వారందరికీ కూడా 0.5 ఎంఎల్‌ ఒక్క డోసు ఇస్తే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత నాలుగు వారాల నుంచీ ఇది పని చెయ్యటం మొదలుపెడుతుంది. టీకా తీసుకున్న రోజున ఇంజక్షన్‌ చేసిన చోట కొద్దిగా నొప్పి, కొద్దిపాటి వాపు, చాలా కొద్దిగా జ్వరం ఉండొచ్చు. అయితే టీకా ఎప్పుడూ కూడా వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఇప్పటికే జ్వరం ఉన్నవాళ్లు, ఇప్పటికే ఏదైనా నాడీమండల (నరాల) సమస్యలున్న వాళ్లు, గుడ్డు సరిపడని అలర్జీ ఉన్న వాళ్లు మాత్రం దీన్ని తీసుకోకూడదు.
 
* గర్భిణులకు: గర్భిణులు మొదటి మూడు నెలల్లో టీకా తీసుకోకూడదు. 4-6 నెలల మధ్య తీసుకోవచ్చు. పైగా ఈ సమయంలో తీసుకుంటే అదనపు ప్రయోజనమేమంటే- వీరికి పుట్టే పిల్లలకు కూడా ఫ్లూ రాకుండా రక్షణ ఉంటోంది. (ఈ టీకాను మామూలుగా ఆర్నెల్ల పైవయసు పిల్లలకే ఇస్తారు. అంటే ఆలోపు పిల్లలకు ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది. అదే గర్భిణి తీసుకుంటే.. ఆ మొదటి ఆర్నెల్లూ కూడా తల్లి టీకా ద్వారా బిడ్డకూ రక్షణ లభిస్తుందన్న మాట!)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1541411" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ