"షోలే" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,506 bytes added ,  4 సంవత్సరాల క్రితం
==చిత్రకథ==
రాంగఢ్ అనే కుగ్రామంలో ఠాకూర్ బల్‌దేవ్ సింగ్(సంజీవ్ కుమార్) అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నివసిస్తూ ఉంటాడు. అతడు విధిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన ఇద్దరు చిల్లరదొంగలు వీరూ, జై లను రప్పించి వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. బందిపోటు గబ్బర్‌సింగ్‌ను ప్రాణాలతో బంధించే విషయంలో అతడికి సహాయం చేస్తే ప్రభుత్వం ప్రకటించిన 50,000 రూపాయలతోపాటు అదనంగా మరో 20,000 రూపాయలను ఇస్తానని ఠాకూర్ ఆ ఇద్దరికీ ఆశ పెడతాడు.
In the small village of Ramgarh, the retired policeman Thakur Baldev Singh (Sanjeev Kumar) summons a pair of small-time thieves that he had once arrested. Thakur feels that the duo—Veeru (Dharmendra) and Jai (Amitabh Bachchan)—would be ideal to help him capture Gabbar Singh (Amjad Khan), a dacoit wanted by the authorities for a ₹ 50,000[a] reward. Thakur tells them to surrender Gabbar to him, alive, for an additional ₹ 20,000 reward.
 
గ్రామస్తులను దోచుకోవడానికి గబ్బర్‌సింగ్ పంపిన బందిపోటు దొంగలను ఆ ఇద్దరూ ఎదుర్కొని వారిని తరిమికొడతారు. వెంటనే హోలీ పండుగ రోజు గబ్బర్ అతని అనుచరులు రాంగఢ్‌పై దాడి చేస్తారు. బందిపోట్లకు, వీరూ, జై ద్వయానికీ మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఠాకూర్ అందుబాటులో తుపాకీ ఉన్నా అతడు వారికి సహాయం చేయడు. వీరూ, జై పోరాడి బందిపోట్లను తరిమికొడతారు. ఆ ఇద్దరూ ఠాకూర్ చర్యకు నిరసన తెలుపుతూ ఆ గ్రామం వదిలి వెళ్లడానికి సిద్ధపడతారు. అప్పుడు ఠాకూర్ తన కుటుంబం అంతటినీ కొన్నేళ్ల క్రితం గబ్బర్‌సింగ్ చంపివేసి, తన రెండు చేతులను నరికివేసిన విషాయాన్ని వారికి వివరిస్తాడు. ఆ కారణంతోనే తాను తుపాకీని ఉపయోగించలేకపోయానని చెప్తాడు. తను ఎప్పుడూ కప్పుకుని ఉండే శాలువాను తీసి తన మొండిచేతులను వారికి చూపిస్తాడు.
The two thieves thwart the dacoits sent by Gabbar to extort the villagers. Soon afterwards, Gabbar and his goons attack Ramgarh during the festival of Holi. In a tough battle, Veeru and Jai are cornered. Thakur, although he has a gun within his reach, does not help them. Veeru and Jai fight back and the bandits flee. The two are, however, upset at Thakur's inaction, and consider leaving the village. Thakur explains that Gabbar had killed nearly all of his family members, and cut off both his arms a few years earlier, which is why he could not use the gun. He had concealed the dismemberment by always wearing a shawl.
 
కలివిడిగా ఉండే వీరూ, ముభావంగా ఉండే జై ఆ గ్రామప్రజల అభిమానాన్ని చూరగొంటారు. వీరూ జట్కాబండిని నడిపే బసంతి(హేమమాలిని)ని ఆకర్షిస్తాడు. జై విధవరాలైన ఠాకూర్ కోడలు రాధ(జయబాధురి)ని ప్రేమిస్తాడు.
Living in Ramgarh, the jovial Veeru and cynical Jai find themselves growing fond of the villagers. Veeru is attracted to Basanti (Hema Malini), a feisty, talkative young woman who makes her living by driving a horse-cart. Jai is drawn to Radha (Jaya Bhaduri), Thakur's reclusive, widowed daughter-in-law, who subtly returns his affections.
 
గబ్బర్ సింగ్ ముఠా వీరూ బసంతిలను పట్టి బంధిస్తుంది. జై ఆ బందిపోట్లపై దాడిచేసి వారిని విడిపిస్తాడు. ఆ ముగ్గురూ ఒక పెద్దబండ వెనక దాగి గబ్బర్ సింగ్ ముఠాపై గుళ్ల వర్షం కురిపిస్తూ ఉంటారు. వారి వద్దనున్న మందుగుండు సామాగ్రి తగ్గిపోతూ ఉండడంతో వీరూ వాటికోసం అక్కడి నుండి బలవంతంగా వెళ్లవలసివస్తుంది. జై అప్పటికే గాయపడిన విషయం అతనికి తెలియదు. ఇంతలో ఒక్కడే గబ్బర్‌ సింగ్ ముఠాతో పోరాడుతున్న జై తనవద్ద నున్న చివరి తూటాతో డైనమైట్‌ను పేల్చి వంతెనను కూల్చివేయడానికి తన ప్రాణాలను అర్పించుకుంటాడు.
Skirmishes between Gabbar's gang and Jai-Veeru finally result in the capture of Veeru and Basanti by the dacoits. Jai attacks the gang, and the three are able to flee Gabbar's hideout with dacoits in pursuit. Fighting from behind a rock, Jai and Veeru nearly run out of ammunition. Veeru, unaware that Jai was wounded in the gunfight, is forced to leave for more ammunition. Meanwhile, Jai, who is continuing the gunfight singlehandedly, decides to sacrifice himself by using his last bullet to ignite dynamite sticks on a bridge from close range.
 
తిరిగివచ్చిన వీరూ చేతులలో జై మరణిస్తాడు. వీరూ ఉగ్రరూపం దాల్చి గబ్బర్ స్థావరంపై దాడి చేసి అతడిని పట్టుకుంటాడు. అతడిని చితకబాది చంపడానికి ప్రయత్నించగా ఠాకూర్ ప్రత్యక్షమై అతడిని సజీవంగా అప్పగిస్తానని మాట ఇచ్చిన విషయం గుర్తుచేస్తాడు. ఠాకూర్ తన కాళ్ళతో గబ్బర్‌సింగ్‌ను గాయపరచి అతని చేతులను నరికివేస్తాడు. పోలీసులు వచ్చి గబ్బర్‌ను అరెస్ట్ చేస్తారు. జై దహనసంస్కారాల తరువాత వీరూ రాంగఢ్ వదిలి వెళతాడు. బసంతి అతనికోసం రైల్వేస్టేషన్‌లో సిద్ధంగా ఉంటుంది. రాధ ఏకాకిగా మిగిలిపోతుంది.
Veeru returns, and Jai dies in his arms. Enraged, Veeru attacks Gabbar's den and catches the dacoit. Veeru nearly beats Gabbar to death when Thakur appears and reminds Veeru of the promise to hand over Gabbar alive. Thakur uses his spike-soled shoes to severely injure Gabbar and destroy his hands. The police then arrive and arrest Gabbar. After Jai's funeral, Veeru leaves Ramgarh and finds Basanti waiting for him on the train. Radha is left alone again.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1977149" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ