కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →మూలాలు |
||
పంక్తి 117: | పంక్తి 117: | ||
ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి [[కంప్యూటర్ సాఫ్ట్వేర్|సాఫ్ట్ వేర్]] కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, గ్రామాన్ని దత్తత తీసుకొని, '''వి.ఎస్.నల్లూరి ఫౌండేషను''' ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [2] |
ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి [[కంప్యూటర్ సాఫ్ట్వేర్|సాఫ్ట్ వేర్]] కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, గ్రామాన్ని దత్తత తీసుకొని, '''వి.ఎస్.నల్లూరి ఫౌండేషను''' ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [2] |
||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
|||
==వెలుపలి లింకులు== |
==వెలుపలి లింకులు== |
04:16, 6 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు
"కూనంనేని వారి పాలెం(కె.వి.పాలెం)"ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం[1].
కె.వి.పాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°34′55″N 79°52′05″E / 15.581992°N 79.868066°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చీమకుర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 523 263 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం
నాయుడు చెరువు:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2015, ఆగస్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాయపూడి కోటయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కూనంనెని శ్రీనివాసరావు ఎన్నికైనారు. [1]&[2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖమాసం (మే నెల) లో వైభవంగా నిర్వహించెదరు. [4]
బొడ్డురాయి ప్రతిష్ఠ
ఈ గ్రామంలో 2014, ఆగస్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
ఈ గ్రామములో శీతలాంబ, నాభిశిల ప్రతిష్ట వేడుకలు నిర్వహించి మూడు సంవత్సరాలయిన సందర్భంగా, 2017,ఆగష్టు-13వతేదీ ఆదివారంనాడు, ఉత్సవాలు నిర్వహించినారు. ముందుగా మహిళలు పొంగళ్ళతో నాభిశిల వద్దకు చేరుకుని, పూజలు నిర్వహించినారు, నైవేద్యాలు సమర్పించినారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [7]
శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016, ఫిబ్రవరి-11, గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. [6]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, గ్రామాన్ని దత్తత తీసుకొని, వి.ఎస్.నల్లూరి ఫౌండేషను ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [2]
మూలాలు
వెలుపలి లింకులు
[1]ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జూలై-26; 1వపేజీ.[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,డిసెంబరు-30; 1వపేజీ.[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగస్టు-9; 1వపేజీ.[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-9; 1వపేజీ.[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-12; 3వపేజీ.[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-12; 2వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,ఆగస్టు-14; 1వపేజీ.