కిలోగ్రాము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,143 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
భౌతిక శాస్త్రంలో [[బరువు]] లేదా భారము (weight), గరిమ లేదా [[ద్రవ్యరాసి]] (mass) అనే రెండు సంబంధిత భావాలు ఉన్నాయి. పదార్థం ఎంత ఉందో చెప్పేది గరిమ. గరిమ అనేది పదార్థం యొక్క జడత్వ లక్షణాన్ని (inertial property) చెబుతుంది. జడత్వం అంటే ఏమిటి? స్థిరంగా ఉన్నప్పుడు కదలడానికి సుముఖత చూపకపోవడం, కదులుతూన్నప్పుడు ఆగడానికి సుముఖత చూపకపోవడం. దీనినే స్థావరజంగమాత్మక లక్షణం అని కూడా అంటారు. బరువు (weight) అనేది స్థానికంగా ఉన్న గురుత్వాకర్షక బలం (gravitational force) మీద ఆధారపడి ఉంటుంది. ఒకే వస్తువు ఎక్కువ గురుత్వాకర్షక బలం ఉన్న క్షేత్రంలో ఎక్కువ బరువు తూగుతుంది; అదే వస్తువు తక్కువ గురుత్వాకర్షజక బలం ఉన్న క్షేత్రంలో తక్కువ బరువు తూగుతుంది. రెండు సందర్భాలలో గరిమ (ద్రవ్యరాసి) ఒక్కటే కాని బరువులో తేడా! ఈ తేడాని సుబోధకం చెయ్యడానికి నిత్యజీవితంలో తారసపడే రెండు పరికరాలని చూద్దాం. మొదటి బొమ్మలో స్ప్రింగు ఉన్న భారమాపకం (బొమ్మ చూడండి) లోని తొట్టెలో పెట్టిన వస్తువు బరువు (weight) ని బట్టి స్ప్రింగు పొడుగు తగ్గుతుంది. రెండవ బొమ్మ త్రాసులో రెండు తక్కెడలు ఉన్నాయి కదా. రెండింటి మీద ప్రసరించే భూమ్యాకర్షక బలం రద్దు అయిపోయింది కనుక మనం తూచే వస్తువ యొక్క గరిమ తెలుస్తుంది.
==అంతర్జాతీయ స్థాయీకరణ==
బరువుని తూచడానికి ప్రపంచవ్యాపతంగాప్రపంచవ్యాప్తంగా ఒక సుస్థిరమైన అవగాహన ఉండడం అవసరం అని చాల కాలం కిందటే గుర్తించేరు. ఈ సుస్థిరమైన ప్రమాణం భౌతికమైన పదార్థాల మీద కాకుండా సహజసిద్ధమైన స్థిరాంకాల మీద ఆధారపడితే బాగుంటుందని సర్వులూ ఒక ఆమోదానికి వచ్చేరు. అందుకని కిలోగ్రాము బరువుని ప్లేంక్ స్థిరాంకం (h) తో ముడి పెట్టేరు. ఈ ప్లేంక్ స్థిరాంకం (h) ఒక తేజాణువు (photon) యొక్క శక్తిని (energy, E), దాని తరచుదనాన్ని (frequency, f) సమీకరిస్తుంది.: <math> E = h f </math>. ఈ ప్లేంక్ స్థిరాంకం విలువ సెకండు ఒక్కంటికి, చదరపు మీటరు ఒక్కంటికి <marh> 6.626069 \times 10^ -{34}</math> అని మనకి తెలుసు. ఇహ సెకండుని, మీటరుని ఖచ్చితంగా కొలవ గలిగితే కిలోగ్రాము విలువ కట్టవచ్చు.
 
సీజియం-133 అనే మూలకం ఒక నిర్ధేశించిన శక్తిని విడుదల చెయ్యడానికి పట్టే కాలం "సెకండు" (second) అనుకోమన్నారు. శూన్యంలో కాంతి ఒక సెకండు వ్యవధిలో ప్రయాణం చేసే దూరంలో (1/299,792,458) వ భాగం ఒక [[మీటరు]] అనుకోమన్నారు. సెకండు, మీటరు తెలిశాయి కనుక కిలోగ్రాము విలువ కట్టడం కష్టణం కాదు.
 
==మూలాలు==
8,000

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2659124" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ