ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 56: పంక్తి 56:
==విశేషాలు==
==విశేషాలు==
ఈ పాటను [[పి.సుశీల]] నటి [[జయసుధ]] కొరకు పాడారు. దర్శకుడు [[దాసరి నారాయణరావు]] ఈ పాటను [[జయసుధ]] మరియు [[అక్కినేని నాగేశ్వరరావు]] మీద చిత్రీకరించారు. ఈ పాట [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. [[రమేష్ నాయుడు]] సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.
ఈ పాటను [[పి.సుశీల]] నటి [[జయసుధ]] కొరకు పాడారు. దర్శకుడు [[దాసరి నారాయణరావు]] ఈ పాటను [[జయసుధ]] మరియు [[అక్కినేని నాగేశ్వరరావు]] మీద చిత్రీకరించారు. ఈ పాట [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. [[రమేష్ నాయుడు]] సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.

ఈ పాటను శ్రీ కృష్ణశాస్త్రి గారు ఒకసారి విజయవాడ(ఒకప్పటి బెజవాడ)నుండి బళ్ళారికి రయిల్ లో వెళ్లునప్పుడు గిద్దలూరు-నంద్యాల మద్యనున్న నల్లమల్ల ఆడవి గుండ వెళ్లునప్పుడు,అచ్చటి ఆడవి అందం చూసి నప్పుడు ఆయన గుండెలోతులనుండి అశువుగా గంగ ప్రవహంలా పుట్తిన అందమయిన గేయం అది.కలకాలం సాహిత్య ప్రియుల గుండెలో నిలిచే పాట.
ఈ పాటను శ్రీ కృష్ణశాస్త్రి గారు ఒకసారి విజయవాడ (ఒకప్పటి బెజవాడ) నుండి బళ్ళారికి రైలు లో వెళ్లునప్పుడు గిద్దలూరు-నంద్యాల మద్యనున్న [[నల్లమల]] ఆడవి గుండ వెళ్లునప్పుడు, అచ్చటి ఆడవి అందం చూసి నప్పుడు ఆయన గుండెలోతుల నుండి అశువుగా గంగా ప్రవహంలా పుట్తిన అందమయిన గేయం అది. కలకాలం సాహిత్య ప్రియుల గుండెలో నిలిచే పాట.


==అవార్డులు==
==అవార్డులు==

06:28, 30 జనవరి 2011 నాటి కూర్పు

ఆకులో ఆకునై పూవులో పూవునై 1982లో విడుదలైన మేఘసందేశం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట పాడినందుకు పి.సుశీలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గాయనిగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటకు సాహిత్యం అందించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం అందించింది రమేష్ నాయుడు.

పాట

ఆ......

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా


గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై

గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై

జలజలనీ పారు సెలపాటలో తేటనై

పగడాల చిగురాకు తెరచాటు తేటినై

పరువంపు విరి చేడే చిన్నరి సిగ్గునై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా


తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల

చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా దాహమా చింతలా వంతలా

ఈ తరణి వెర్రినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఎటులైనా ఇచటనే ఆగిపోనా

విశేషాలు

ఈ పాటను పి.సుశీల నటి జయసుధ కొరకు పాడారు. దర్శకుడు దాసరి నారాయణరావు ఈ పాటను జయసుధ మరియు అక్కినేని నాగేశ్వరరావు మీద చిత్రీకరించారు. ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. రమేష్ నాయుడు సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.

ఈ పాటను శ్రీ కృష్ణశాస్త్రి గారు ఒకసారి విజయవాడ (ఒకప్పటి బెజవాడ) నుండి బళ్ళారికి రైలు లో వెళ్లునప్పుడు గిద్దలూరు-నంద్యాల మద్యనున్న నల్లమల ఆడవి గుండ వెళ్లునప్పుడు, అచ్చటి ఆడవి అందం చూసి నప్పుడు ఆయన గుండెలోతుల నుండి అశువుగా గంగా ప్రవహంలా పుట్తిన అందమయిన గేయం అది. కలకాలం సాహిత్య ప్రియుల గుండెలో నిలిచే పాట.

అవార్డులు

లింకులు