గజేంద్ర సింగ్ షెకావత్
స్వరూపం
గజేంద్ర సింగ్ షెకావత్ (జననం 1967 అక్టోబర్ 3) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర జల శక్తి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను రాజస్థాన్ లోని జోద్పూర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు.
తొలినాళ్ళ జీవితం
రాజస్థాన్ కి చెందిన శిఖర్ జిల్లాలోని మహారోలి గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి శంకర్ సింగ్ షెకావత్, రాజస్థాన్ రాష్ట్రంలోని వైద్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాడు. ఇతని తండ్రి ఉద్యోగ నిమిత్తం తరచూ స్థలాలు మారుతూ ఉండడం వల్ల వివిధ పాఠశాలల్లో గజేంద్ర తన విద్యాభ్యాసాన్ని కొనసాగిచాల్సవలసి వచ్చింది. ఇతను జోధ్పూర్లోని జై నారాయణ్ వ్యాస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇంకా ఫిలాసఫీ విద్యనభ్యసించాడు.