ఐసోబారులు
ఒకే ద్రవ్యరాశి సంఖ్య వేర్వేరు పరమాణు సంఖ్యలు కలిగిన వేర్వేరు మూలక పరమాణువులను ఐసోబారులు అందురు. ఐసోబారులలో ప్రోటాన్ల సంఖ్యలు మారుతాయి. అందువల్ల మూలకాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.
ఉదాహరణలు:
- 19K40 మరియు 20Ca40 లు ఐసోబారులు. వీటిలో ద్రవ్యరాశి సంఖ్య లు సమానం కాని పరమాణుసంఖ్యలు వేర్వేరుగా కలవు.
- 6C13 మరియు 7N13 లు ఐసోబారులు. వీటిలో ద్రవ్యరాశి సంఖ్య లు సమానం కాని పరమాణుసంఖ్యలు వేర్వేరుగా కలవు.